AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

November 2026: వీరి జీవితంలో కొత్త మలుపు.. అదృష్టం తలుపు తట్టనుంది..!

November 2026 Horoscope: అక్టోబర్ 31 నుంచి గురువు సింహ రాశిలో సంచారం ప్రారంభించడం, నవంబర్ 12, 13 తేదీల్లో శుక్ర, బుధ, శనులు వక్ర త్యాగం చేయడం, కుజుడు సింహ రాశిలోకి మారడం వంటి కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. దీని ప్రభావంతో నవంబర్ మాసంలో కొన్ని రాశుల వారి జీవితాలో పెను మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది. వారి జీవితాల్లో కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా మేషం, వృషభం. మిథునం, కర్కాటకం, తుల, మకర రాశుల వారికి దాదాపు కొత్త జీవితం ప్రారంభమవుతుంది. ఆదాయం పెరగడం, ఉద్యోగంలో అందలాలు ఎక్కడం, ఆరోగ్యం మెరుగుపడడం, వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపట్టడం, కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోవడం వంటివి జరుగుతాయి.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 29, 2026 | 3:32 PM

Share
మేషం: రాశ్యధిపతి కుజుడితో సహా నాలుగు గ్రహాల స్థితిగతులు మారడం వల్ల ఈ రాశివారి జీవితం గతం కంటే మరింత మెరుగైన స్థానానికి చేరుకోవడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, కుటుం బంలో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో కూడిన పదోన్నతి లభిస్తుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న నిరుద్యోగుల కల సాకారం అవు తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా ఊపందుకుంటాయి.

1 / 6
వృషభం: ఈ రాశికి చతుర్థ స్థానంలోకి గురు, కుజులు ప్రవేశించడం, రాశ్యధిపతి శుక్రుడు వక్ర త్యాగం చేయడం వల్ల ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అంచనాల్ని మించి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు సఫలమవుతాయి.

2 / 6
మిథునం: ఈ రాశికి తృతీయ, పంచమ స్థానాల్లో గ్రహాల స్థితిగతులు మారుతున్నందువల్ల వృత్తి, వ్యాపా రాలు నష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడి లాభాల బాట పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా హోదా, జీతభత్యాలు పెరుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. అనేక విధాలుగా రాబడి పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది.

3 / 6
కర్కాటకం: ఈ రాశికి ధన, చతుర్థ స్థానాల్లో గ్రహాల మార్పు చోటు చేసుకుంటున్నందువల్ల  శుభవార్తలకు, శుభ పరిణామాలకు ఎక్కువగా అవకాశం ఉంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఉద్యోగ జీవితం అనేక విధాలుగా కొత్త పుంతలు తొక్కుతుంది. ఉద్యోగపరంగా స్థిరమైన, ప్రోత్సాహ వంతమైన జీవితం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవి లభిస్తుంది. ప్రాధాన్యం పెరుగు తుంది. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు బిజీ అవుతాయి.

4 / 6
తుల: ఈ రాశిలోనూ, లాభ స్థానంలోనూ గ్రహాలు బలపడుతున్నందువల్ల ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం కలుగుతుంది. ఉన్నత పదవులతో పాటు జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని మించుతుంది. ఆదాయ వృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టి విటీ, రాబడి బాగా పెరుగుతాయి. పిత్రార్జితం కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి.

5 / 6
మకరం: ఈ రాశికి అష్టమ, దశమ స్థానాల్లో గ్రహ సంచారం ఎక్కువగా ఉండబోతున్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక, విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. రాబడి, లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదాతో పాటు బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

6 / 6
Follow Us