వర్కౌట్ చేసేప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆపేయండి.. లేదంటే
29 Oct 2026
Anand T
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే నడకతో పాటు ప్రతిరోజూ వ్యాయామం చేయడం ఎంతో ముఖ్యం
గుండె ఆరోగ్యం
అయితే వ్యాయామం చేసేటప్పుడు మీలో కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం మీరు కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి.
అప్రమత్తత
వ్యాయామం చేస్తున్నప్పుడు మీకు ఛాతీ నొప్పి, ఛాతీపై ఒత్తిడి, బిగుతుగా అనిపిస్తే లేదా అసౌకర్యంగా ఉంటే వెంటనే వ్యాయామం ఆపేయండి.
ఛాతీలో అసౌకర్యం
ఆ నొప్పి చేయి, భుజం, వీపు, మెడ లేదా దవడకు వ్యాపిస్తే ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
వ్యాపిస్తే ప్రమాదం
మీరు ఎలాంటి వార్మప్ చేయకుండా ఒకేసారి ఎక్కువగా వర్కౌట్స్ చేయడం మంచిది కాదు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
డైరెక్ట్ వర్కౌట్స్ వద్దు
జిమ్‌లో మీ సామర్థ్యానికి మించి బరువులు ఎత్తడం వల్ల శరీరంపై అధిక ఒత్తిడి పడి ఆరోగ్యం దెబ్బతినవచ్చు.
లిమిటెడ్ వెయిట్
ముఖ్యంగా గుండె కొట్టుకునే వేగం, రక్తపోటు ఒక్కసారిగా పెరగవచ్చు. కాబట్టి ఇలాంటి లక్షణాల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది.
గుండె వేగం
ముఖ్యంగా మొదటిసారి జిమ్‌కు వెళ్లే వారు మొదట్లోనే ఎక్కువ బరువులు ఎత్తవద్దు.. మెల్లమెల్లగా అలవాటు చేసుకోండి. అలాగే వర్కౌట్‌కు ముందు వార్మప్ చేయడం మర్చిపోకండి.