AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajendra Prasad: ఆ హీరో చెప్పిన మాట జీవితంలో మర్చిపోలేను.. అతడు ఇచ్చిన ధైర్యం నాలో ఎప్పటికీ ఉండిపోతుంది.. రాజేంద్రప్రసాద్..

టాలీవుడ్ విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన కుమార్తె మరణించినప్పుడు ఓ హీరో స్వయంగా వచ్చి ధైర్యం చెప్పడం ఆయన గొప్పదనాన్ని చాటుతుందని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. చిరంజీవి, మహేష్, నాగార్జున వంటి తారలు తన పట్ల చూపిన ప్రేమను గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీ తనపై చూపిన ఆప్యాయతను మర్చిపోలేనని తెలిపారు.

Rajendra Prasad: ఆ హీరో చెప్పిన మాట జీవితంలో మర్చిపోలేను.. అతడు ఇచ్చిన ధైర్యం నాలో ఎప్పటికీ ఉండిపోతుంది.. రాజేంద్రప్రసాద్..
Rajendra Prasad
Rajitha Chanti
|

Updated on: Oct 29, 2026 | 3:29 PM

Share

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తన వ్యక్తిగత జీవితంలో అత్యంత బాధాకరమైన సందర్భంలో, తన కుమార్తె మరణానంతరం, టాలీవుడ్ ప్రముఖులు తన పట్ల చూపిన ఆత్మీయతను, అండదండలను ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఈ కష్టకాలంలో ఇండస్ట్రీ తనతో నిలబడిందని, ముఖ్యంగా “డార్లింగ్” ప్రభాస్ ఇచ్చిన ధైర్యం తనలో ఎప్పటికీ నిలిచిపోతుందని ఆయన భావోద్వేగంతో వెల్లడించారు. “ప్రభాస్ గారు సాధారణంగా బయటికి రారు, ఇండస్ట్రీలో చాలా తక్కువగా కనిపిస్తారు. అలాంటిది నా పాప చనిపోతే స్వయంగా ఇంటికి వచ్చి నన్ను పలకరించిన విషయం మర్చిపోలేను” అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రభాస్ తనను “ఆయన పెద్ద ఫ్యాన్ నాకు” అని గోదావరి యాసలో సంబోధించడమే కాకుండా, “మీరు మాకు కావాలి. మీరు మాత్రం తగ్గద్దు, డల్ అవ్వొద్దు. మీతో మాకు చాలా పని ఉంది. మీరు హుషారుగా ఉండండి ప్లీజ్” అని ధైర్యం చెప్పారని రాజేంద్ర ప్రసాద్ గుర్తుచేసుకున్నారు. ప్రభాస్‌తో తాను పెద్ద సినిమాలు చేయకపోయినా ఆయన చూపిన ప్రేమ అపురూపమని అన్నారు. ప్రభాస్ వ్యక్తిత్వం అద్భుతమని, ఆయనొక “జెమ్ ఆఫ్ ఎ పర్సన్” అని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..

ప్రభాస్‌తో పాటు మహేష్ బాబు తన కుటుంబంతో సహా వచ్చి పరామర్శించారని రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. పక్కింటాళ్ళను కూడా అంతగా కలవని నాగార్జున కూడా వచ్చి అండగా నిలిచారని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు (చిరంజీవి, సురేఖ) వచ్చి ఒక గంట సేపు అక్కడే ఉండి తనను ఓదార్చారని, “ఏంటి రాజా నీకిలా జరిగింది” అంటూ మంచి స్నేహితుడిగా తన పక్కన నిలబడ్డారని వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..

అల్లు అర్జున్, వెంకటేష్ వంటి ఇతర తారలు కూడా వచ్చి తనతో తోడుగా ఉన్నారని చెప్పారు. ఆ సమయంలో “ఇండస్ట్రీ మొత్తం వచ్చారు. నేనైతే ఎంత ఆశ్చర్యపోయానో. నిజంగా చెప్తున్నా సినిమా ఇండస్ట్రీలో నా మీద ఉన్న ప్రేమ మా అమ్మాయి చనిపోయినప్పుడు చూశాను నేను” అంటూ రాజేంద్ర ప్రసాద్ బావోద్వేగానికి గురయ్యారు.

ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..

రాజేంద్రప్రసాద్, ప్రభాస్..

Rajendra Prasad, Prabhas

Rajendra Prasad, Prabhas

ఎక్కువ మంది చదివినవి :  Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..

Follow Us