AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరెరె ఇన్నాళ్లు తెలియకుండా తినేశారా.. వంకాయ వీరికి డేంజర్.. తింటే ఈ సమస్యలు కొనితెచ్చుకున్నట్లే..

వంకాయ కూరంటే ఇష్టపడని దాదాపు ఉండరు.. గుత్తి వంకాయ, వంకాయ వేపుడు కనిపిస్తే చాలు లొట్టలేసుకుంటూ లాగించేస్తుంటారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాలు ఇందులో మెండుగా ఉన్న మాట నిజమే అయినా.. అతిగా తింటే మాత్రం అమృతం కూడా విషంగా మారుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. వంకాయ ఎక్కువగా తినడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Oct 29, 2026 | 3:31 PM

Share
కూరగాయల రారాజుగా పిలిచే వంకాయ అనేక పోషకాలు, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లకు నిలయం. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, బరువు తగ్గించడంలో, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నివారణలో ఇది ఎంతో దోహదపడుతుంది. అయితే ఇంతటి ఔషధ గుణాలున్న వంకాయను అధికంగా తింటే మాత్రం శరీరంపై పలు దుష్ప్రభావాలు చూపుతుందని ప్రముఖ పోషకాహార నిపుణురాలు మన్‌ప్రీత్ కల్రా స్పష్టం చేస్తున్నారు.

1 / 5
వంకాయ ప్రాథమికంగా నైట్‌షేడ్ జాతికి చెందిన కూరగాయ. దీనిలోని కొన్ని స్వాభావిక లక్షణాల వల్ల కొందరిలో అలెర్జీ సమస్యలు తలెత్తే అవకాశముంది. అతిగా తీసుకోవడం వల్ల శరీరంలో తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్యలు మొదలై శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మంపై దద్దుర్లు, ముఖం లేదా గొంతు వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా అరుదైన సందర్భాల్లో ఇది ప్రాణాంతకమైన అనాఫిలాక్సిస్ అనే తీవ్రమైన అలర్జీ స్థితికి దారితీసే ప్రమాదం కూడా ఉంది.

2 / 5
వంకాయ అధికంగా తీసుకోవడం మూత్రపిండాల పనితీరుపై కూడా ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ఇందులో కాల్షియం, ఆక్సలేట్లు అధిక మొత్తంలో ఉండటం వల్ల, శరీరం వాటిని సరిగ్గా ప్రాసెస్ చేయలేక కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. వంకాయ వంటకాలు తిన్న తర్వాత ఎవరికైనా తీవ్రమైన కడుపు నొప్పి లేదా మూత్రంలో సమస్యలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది.

3 / 5
వంకాయలో సోలనిన్ అనే సహజసిద్ధమైన రసాయన సమ్మేళనం ఉంటుంది. సాధారణ మోతాదులో ఇది హాని చేయకపోయినా, అతిగా తిన్నప్పుడు శరీరంలో సోలనిన్ స్థాయిలు పెరిగి విషతుల్యంగా మారుతాయి. దీనివల్ల వికారం, వాంతులు, కడుపు తిప్పడం, తీవ్రమైన తలతిరగడం వంటి జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి. అలాగే వంకాయ తొక్కలో ఉండే నాసునిన్ అనే రసాయనం శరీరంలోని ఐరన్‌తో బంధాన్ని ఏర్పరచి, కణాల నుంచి ఇనుమును బయటకు లాగేస్తుంది. దీనివల్ల క్రమంగా శరీరంలో ఐరన్ లోపం ఏర్పడే ముప్పు ఉంది.

4 / 5
మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థంలోనూ ప్రయోజనాలతో పాటు కొన్ని పరిమితులు, దుష్ప్రభావాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కూరగాయ కదా అని ఏకధాటిగా లేదా విపరీతంగా తినడం సరికాదు. శరీరానికి మేలు చేస్తుందని భావించే వంకాయను కూడా సమతుల్యంగా, మితంగా తీసుకున్నప్పుడే దాని సంపూర్ణ పోషక లాభాలు అందుతాయి. లేనిపక్షంలో అనవసరమైన అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లే అవుతుంది.

5 / 5
Follow Us