Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10లో ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్.. ఇక ఆ ఇద్దరూ పెట్టె సర్దుకోవాల్సిందే
అత్యంత రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో మరో ట్విస్ట్.. గత వారం లాగే హౌస్ లో ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని తెలుస్తోంది. తక్కువ ఓట్లు పడిన ఇద్దరు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారని సమాచారం.

‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10’ రసవత్తరంగా, హోరాహొరీగా సాగుతోంది. ముఖ్యంగా ప్రేక్షకులకు అద్దిరిపోయే ట్విస్టులు ఇస్తున్నాడు బిగ్ బాస్. అందుకు తగ్గట్టుగానే కంటెస్టెంట్స్ కూడా పోటాపోటీగా ఆడుతున్నారు. ఫిజికల్ టాస్కుల్లో, గేమ్స్ లో సై అంటే సై అనేలా తలపడుతున్నారు. అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ చాలా డిఫరెంట్ గా కనిపించింది. కంటెస్టెంట్స్ పోటీ పడి ఆడినా గొడవలకు దూరంగా ఉన్నారు. నామినేషన్స్ లోనూ పెద్దగా మాటల తూటాలు పేల్చుకోలేదు. మొత్తానికి ఈ వారమంతా బిగ్ బాస్ హౌస్ సందడి సందడిగా మారిపోయింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్. గత వారం లాగే ఈ వారంలోనూ డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని తెలుస్తోంది. దీంతో కంటెస్టెంట్లలో దడ మొదలైంది. ఈ వారం నామినేషన్లలో రోహిత్, వంశీ, రామ్ ప్రసాద్, ఝాన్సీ, శివ, రామకృష్ణ, యాంకర్ వర్షిణి, సుధీర్ ఉన్నారు. మొత్తం ఎనిమిది మంది ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కొంటుండటంతో ఈ వారం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనికి తోడు ఈ వారం ఎవరిపై కూడా పెద్దగా నెగెటివ్ కామెంట్స్ రాలేదు. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారని ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ఓటింగ్ ట్రెండ్స్ ను ఒకసారి పరిశీలిస్తే ఎవరూ ఊహించనట్టుగా టెంపర్ వంశీ టాప్ ప్లేస్ లో కొనసాగుతుండడం విశేషం. రెండో ప్లేసులో రోహిత్ ఉన్నాడు. మూడో స్థానంలో సుధీర్ ఉన్నారు. నాలుగో పొజిషన్ లో ఝాన్సీ, ఐదో స్థానంలో రామ్ ప్రసాద్ ఉన్నారు. ఇక ఆరో ప్లేసులో శివ, ఏడో స్థానంలో రామకృష్ణ, చివరిగా ఎనిమిదో స్థానంలో యాంకర్ వర్షిణీ ఉన్నారు. అంటే ప్రస్తుతం యాంకర్ వర్షిణీ, రామకృష్ణ డేంజర్ జోన్ లో ఉన్నారన్నమాట. ఒకరు ఎలిమినేట్ కావాల్సి వస్తే వర్షిణీ/ రామకృష్ణలలో ఎవరో ఒకరు బయటకు వెళ్లిపోతారు. డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఈ ఇద్దరూ బయటకు వెళ్లిపోకతప్పదు. మరి డబుల్ ఎలిమినేషన్‌పై బిగ్‌బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
కాగా బిగ్ బాస్ సీజన్ ప్రారంభమై దాదాపు 50 రోజులు పూర్తయ్యాయి. ప్రస్తుతం హౌస్ లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. మరో ఎనిమిది వారాల పాటు ఈ రియాలిటీ షో నడవనుంది. టాప్ 5కి ఐదుగురు మాత్రమే వెళ్తారు. ఈ లెక్కన 8 వారాల్లో 10 మంది హౌస్ నుంచి ఎలిమినేట్ కావాల్సి ఉంటుంది. ఈ లెక్కల ప్రకారమే ఈ వారం కూడా బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని తెలుస్తోంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లేటెస్ట్ ప్రోమో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




