AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీటిలో పుట్టి.. నీటిలో పెరిగి.. నీళ్లు తగిలితే చనిపోయేది ఏది..? 99శాతం మంది ఫెయిల్

నీటిలో పుట్టి, నీటిలోనే పెరిగి.. చివరకు నీటి బొట్టు తగలగానే ప్రాణాలు కోల్పోయే వింత జీవి లేదా పదార్థం ఏమై ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల బుర్రలకు పదును పెడుతూ తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ వింత పొడుపు కథకు చాలామంది సమాధానం చెప్పలేక చేతులెత్తేస్తున్నారు. చదవడానికి ఎంతో సులువుగా అనిపించినా, మెదడుకు మేత పెడుతున్న ఈ పజిల్ వెనుక ఉన్న అసలైన సమాధానం గురించి తెలుసుకుందాం..

నీటిలో పుట్టి.. నీటిలో పెరిగి.. నీళ్లు తగిలితే చనిపోయేది ఏది..? 99శాతం మంది ఫెయిల్
Viral Brain Teaser 1
Krishna S
|

Updated on: Oct 29, 2026 | 7:18 PM

Share

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో రకాల పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్లు, పొడుపు కథలు వైరల్ అవుతుంటాయి. కొన్ని తేలికగా అనిపించినా.. సమాధానం కనిపెట్టే సరికి మాత్రం తల ప్రాణం తోకకు వస్తుంది. తాజాగా అలాంటి ఒక ఆసక్తికరమైన పొడుపు కథ నెటిజన్ల బుర్రకు పదును పెడుతోంది. చదవడానికి చాలా సింపుల్‌గా ఉన్నా, సరైన సమాధానం చెప్పలేక చాలామంది తలలు పట్టుకుంటున్నారు. ఆ పొడుకు కథ ఏంటంటే..? “నేను నీటిలోనే పుడతాను, నీటిలోనే పెరుగుతాను.. కానీ నా ఒంటికి నీరు తగిలితే మాత్రం నేను చచ్చిపోతాను..! ఇంతకీ నేను ఎవరిని?”.. చదవడానికి రెండు లైన్లలో ఎంతో సింపుల్‌గా కనిపిస్తున్న ఈ ప్రశ్న, కామెంట్ సెక్షన్‌లో మాత్రం పెద్ద చర్చకే తెరలేపింది. సాధారణంగా ఏ ప్రాణికైనా, జీవికైనా లేదా వస్తువుకైనా పుట్టిన చోటే రక్షణ లభిస్తుంది. నీటిలో పుట్టి పెరిగే జీవులకు నీరే ప్రాణాధారం. కానీ నీరు తగిలితే ప్రాణాలు పోయే ఈ వింత జీవి లేదా పదార్థం ఏమై ఉంటుందా అని నెటిజన్లు తీవ్రంగా ఆలోచిస్తున్నారు.

రకరకాల పేర్లు.. చర్చలు..

చాలామంది మొదటి చూపులోనే చేప అని కామెంట్ చేయగా.. మరికొందరు చేప నీటిలో చనిపోదు కదా, బయటకు తీస్తేనే చస్తుంది అంటూ వారి వాదనను కొట్టిపారేశారు. ఇంకొందరు మంచు గడ్డ కావచ్చని భావించారు. కానీ మంచు నీటిలో పుట్టదు, నీటిని గడ్డకట్టించడం ద్వారా ఏర్పడుతుంది. మరికొందరు కప్పలు, కీటకాలు లేదా ఏదైనా జలచరం అయి ఉంటుందని ఊహించారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్లు చేస్తుండటంతో ఈ పజిల్ మరింత వైరల్‌గా మారింది. అయితే సరైన లాజిక్ ఆలోచించిన అతి కొద్దిమంది మాత్రమే కచ్చితమైన సమాధానాన్ని చెప్పగలిగారు

అసలైన సమాధానం ఇదే

ఈ పొడుపు కథకు సరైన సమాధానం..ఉప్పు. అవును సముద్రపు నీటి ద్వారానే ఉప్పు తయారవుతుంది. అంటే నీటి నుంచే దాని పుట్టుక, ఎదుగుదల జరుగుతాయి. అయితే పూర్తిగా ఎండిన తర్వాత తయారైన ఉప్పుపై మళ్లీ నీటి చుక్క పడితే చాలు.. అది తక్షణమే కరిగిపోయి తన ఉనికిని కోల్పోతుంది. అందుకేనీరు తగిలితే చచ్చిపోతుంది అని వర్ణించారు. మరి ఈ ప్రశ్న చూడగానే మీ మైండ్‌లోకి ఏ సమాధానం వచ్చింది? మీరు దీన్ని మొదటి ప్రయత్నంలోనే కనిపెట్టారా లేదా? మీ స్నేహితులకు కూడా షేర్ చేసి వాళ్ల తెలివితేటలను పరీక్షించండి..

Follow Us
నీటిలో పుట్టి.. నీటిలో పెరిగి.. నీళ్లు తగిలితే చనిపోయేది ఏది..?
నీటిలో పుట్టి.. నీటిలో పెరిగి.. నీళ్లు తగిలితే చనిపోయేది ఏది..?
తెలంగాణ నీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జలమండలి ‘PAANI’ యాప్
తెలంగాణ నీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జలమండలి ‘PAANI’ యాప్
ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడుగుతున్నారా? ఈ నంబర్‌కు ఫోన్ చేయండి
ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడుగుతున్నారా? ఈ నంబర్‌కు ఫోన్ చేయండి
ఐపీఎల్‌లో అత్యంత విలువైన జట్టు ఇదే.. టాప్-10 జట్ల లిస్ట్ ఇదే!
ఐపీఎల్‌లో అత్యంత విలువైన జట్టు ఇదే.. టాప్-10 జట్ల లిస్ట్ ఇదే!
రోడ్డుమీద తెల్ల పేపర్లు ఏరుకుని వాటిపై రాసుకుని చదువుకున్నాడు..
రోడ్డుమీద తెల్ల పేపర్లు ఏరుకుని వాటిపై రాసుకుని చదువుకున్నాడు..
అరుదైన అద్భుతం.. ఒకే ఈతలో మూడు దూడలు..
అరుదైన అద్భుతం.. ఒకే ఈతలో మూడు దూడలు..
కారు రేసింగ్‌ సరదా.. తల్లీ కూతురి ప్రాణాలను బలిగొంది!
కారు రేసింగ్‌ సరదా.. తల్లీ కూతురి ప్రాణాలను బలిగొంది!
'కల్ట్' 'సినిమా రిలీజ్‌కు ముందుకు విశ్వక్ సేన్ సంచలన ప్రకటన
'కల్ట్' 'సినిమా రిలీజ్‌కు ముందుకు విశ్వక్ సేన్ సంచలన ప్రకటన
ఆ 550 ఎకరాలు ప్రభుత్వానివే.. మియాపూర్ భూములు కేసులో సుప్రీం..
ఆ 550 ఎకరాలు ప్రభుత్వానివే.. మియాపూర్ భూములు కేసులో సుప్రీం..
బ్రాండెడ్‌ బియ్యం పేరుతో వినియోగదారులకు టోకరా
బ్రాండెడ్‌ బియ్యం పేరుతో వినియోగదారులకు టోకరా