మళ్లీ అగ్రస్థానానికి బుమ్రా.. టాప్ 10లో విరాట్ కోహ్లీ..
భారత్ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మళ్లీ తానే నెంబర్ వన్ బౌలర్ అని నిరుపించుకున్నాడు. 870 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ ప్రకటించిన ర్యాకింగ్స్‌లో నెంబర్.1గా బుమ్రా ఉన్నాడు. 869 రేటింగ్ పాయింట్లతో ఉన్న మరో స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌ను బుమ్రా దాటి వేసి అగ్రస్థానానికి చేరుకున్నాడు.
భారత్ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మళ్లీ టెస్ట్‌ల్లో తానే నెంబర్ వన్ బౌలర్ అని నిరుపించుకున్నాడు. 870 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ ప్రకటించిన ర్యాకింగ్స్‌లో నెంబర్.1గా బుమ్రా ఉన్నాడు. 869 రేటింగ్ పాయింట్లతో ఉన్న మరో స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌ను బుమ్రా దాటి వేసి అగ్రస్థానానికి వచ్చాడు. ఇటీవలే స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సీరిస్‌లో అశ్విన్, బుమ్రాలు ఏకదాటిగా వికెట్లు పడగొటిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో వీరు ఎవరికివారు 11 వికెట్లు తీశారు. అశ్విన్‌తో పోలిస్తే బుమ్రా చాలా తక్కువ పరుగులు ఇచ్చాడు. ఇక హేజిల్‌వుడ్ మూడో స్థానంలో, కమిన్స్ నాలుగోవ స్థానంలో, రబాడ ఐదోవ స్థానంలో ఉన్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఇక టీమిండియా ఆల్‌రౌండర్ జడేజా 6 స్థానంలో ఉన్నాడు.
యశస్వి జైస్వాల్ ఐసీసీ ప్రకటించిన బ్యాటింగ్ ర్యాకింగ్స్‌లో 3వ స్థానంలో ఉన్నాడు. రన్ మిషిన్ విరాట్ కోహ్లీ 6వ స్థానంలో ఉన్నాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ 9వ స్థానానికి చేరాడు. పంత్ గతంలో 6 స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 15వ స్థానంలో ఉన్నాడు. ఐసీసీ ప్రకటించిన బ్యాటింగ్ ర్యాకింగ్స్‌లో జో రూట్ అగ్రస్థానంలో ఉండగా, కేన్ విలియమ్స్‌న్ రెండు స్థానంలో కొనసాగుతున్నాడు. 2024లో ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ జరిగినప్పుడు కూడా బుమ్రా టాప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది బుమ్రా 7 మ్యాచ్‌లో 38 వికెట్లు తీశాడు. అదే విధంగా శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్య సేమ్ వికెట్లు తీసినా సేమ్ మ్యాచ్‌లో పాల్గొన్నా కానీ అతన్ని బౌలింగ్ యావరేజ్ తక్కువగా ఉంది. అందుకే అతని కంటే బుమ్రా ముందు ఉన్నాడు.
ఐసీసీ ప్రకటించిన ర్యాకింగ్స్ ఇలా:
బౌలింగ్: 1. జస్‌ప్రీత్ బుమ్రా
2.. రవిచంద్రన్ అశ్విన్
3..హేజిల్‌వుడ్
4..కమిన్స్
5..రబాడ
6..జడేజా
బ్యాటింగ్:
1.. జో రూట్
2..కేన్ విలియమ్స్‌న్
3..యశస్వి జైస్వాల్
6..విరాట్ కోహ్లీ
9..రిషబ్ పంత్