AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: ఇదివరకో లెక్క.. ఇప్పుడో లెక్క.. మావొడు ఒక్కడు చాలు.. మీకిక రక్త కన్నీరే

India vs New Zealand Final: భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2026 కోసం సిద్ధమవుతోంది. న్యూజిలాండ్ జట్టుతో ఫైనల్ పోరుకు రెడీ అయింది. అయితే, భారత జట్టు గత పాత ఓటములను మర్చిపోయి, ప్రతీకారం కోసం బరిలోకి దిగేందుకు సిద్ధమైంది.

IND vs NZ: ఇదివరకో లెక్క.. ఇప్పుడో లెక్క.. మావొడు ఒక్కడు చాలు.. మీకిక రక్త కన్నీరే
Ind Vs Nz
Venkata Chari
|

Updated on: Mar 07, 2026 | 12:51 PM

Share

India vs New Zealand: భారత జట్టు ఫైనల్ మ్యాచ్ కోసం సిద్ధమైంది. అహ్మాదాబాద్‌లో న్యూజిలాండ్ జట్టుతో ఫైనల్ పోరుకు రెడీ అయింది. అయితే, ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన భారత జట్టు.. ఈసారి పక్కా ప్లాన్‌తో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో కివీస్ జట్టుపై పరాజయాలు ఎదురయ్యాయి. ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌లో ఆడిన 3 మ్యాచ్‌ల్లో 3 ఓడిపోయింది. ఈసారి లెక్కలు సరిచేయాలని సూర్యసేన బలంగా కోరుకుంటుంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు మాత్రం ఇదే సీన్ రిపీట్ చేయాలని కోరుకుటుంది. ఈ క్రమంలో సూర్యకుమాార్ యాదవ్ కివీస్ జట్టుకు ఓ సవాల్ విసిరాడు. ఇది వరకు ఓ లెక్క.. ప్రస్తుతం మరో లెక్కలా మారనుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సంజూ శాంసన్‌తోపాటు అభిషేక్ శర్మ ఫాంలోకి వస్తే.. టీమిండియాను ఎదుర్కొవాలంటే ఆలోచించాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, సూర్యసేన మాత్రం బలంగా న్యూజిలాండ్ జట్టును ఎదుర్కొవాలని కోరుకుంటుంది. ప్రస్తుతం భారత జట్టు అద్భుతంగా దూసుకెళ్తుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లోనూ రాణిస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్ ఎంతో బలంగా కనిపిస్తోంది. టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. అయితే, అభిషేక్ శర్మ మాత్రం వరుసగా నిరాశ పరుస్తున్నాడు. ఇదొక్కటే భారత జట్టును కలవరపరుస్తోంది. ఆ తర్వాత శివం దుబే, సూర్యకుమార్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ ఇలా హార్డ్ హిట్టర్స్ ఉన్నారు. వీరిలో ఇద్దరు చివరి వరకు నిలబడితే మరోసారి భారీ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఫైనల్ మ్యాచ్‌లో మరోసారి భారత బ్యాటర్లు బలమైన స్కోర్ చేస్తే.. దానిని కాపాడుకోవడం కోసం డేంజరస్ బౌలర్లు కూడా భారత అమ్ములపొదిలో ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా ఉన్నారు.

మొత్తంగా గత చరిత్రను మరచిపోయి, ట్రోఫీని దక్కించుకోవాలంటే మాత్రం సూర్యసేన అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. కాగా, సూర్యకుమార్ యాదవ్ ఒక్కడు ఓ ఎండ్ నుంచి అండగా నిలవాలని భారత జట్టు కోరుకుంటుంది.

స్క్వాడ్‌లు:

భారత జట్టు: అభిషేక్ శర్మ, సంజు శాంసన్(కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సింగ్.

న్యూజిలాండ్ జట్టు: టిమ్ సీఫెర్ట్(కెప్టెన్), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కోల్ మెక్‌కాంచీ, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ, జేమ్స్ నీషమ్, కైల్ జామిసన్, డెవాన్ కాన్వే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us