AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu: ఆదిత్య ఓం మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా..

ఈ వీకెండ్ లో దాదాపు ఎనిమిది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండనున్నాయని సమాచారం. గత సీజన్లకు చెందిన పలువురు కంటెస్టెంట్లను మరోసారి హౌస్ లోకి పంపించనున్నారట. దీంతో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై సోషల్ మీడియాలో బజ్ నడుస్తుంది. ఈసారి హౌస్ లోకి ఎవరెవరు రాబోతున్నారో తెలుసుకోవడానికి అడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

Bigg Boss 8 Telugu: ఆదిత్య ఓం మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా..
Aditya Om
Rajitha Chanti
|

Updated on: Oct 04, 2024 | 9:26 PM

Share

బిగ్‌బాస్‌ సీజన్ 8 మొన్నటివరకు రసవత్తరంగా సాగింది. గొడవలు, అలకలు, ముచ్చట్లు, పంతాలు ఇలా ఒక్కటేమిటీ ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందించారు. కానీ ఈ వారం అసలు ఎంటర్టైన్మెంట్ కాదు కదా.. అడియన్స్ అంతగా ఇంట్రెస్ట్ కూడా చూపించడం లేదు. కానీ ఈవారం మాత్రం మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది. అలాగే ఈ వీకెండ్ లో దాదాపు ఎనిమిది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండనున్నాయని సమాచారం. గత సీజన్లకు చెందిన పలువురు కంటెస్టెంట్లను మరోసారి హౌస్ లోకి పంపించనున్నారట. దీంతో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై సోషల్ మీడియాలో బజ్ నడుస్తుంది. ఈసారి హౌస్ లోకి ఎవరెవరు రాబోతున్నారో తెలుసుకోవడానికి అడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈవారం మరో ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తోంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ కాకుండా.. ఇప్పుడు వీకెండ్ లోనూ మరో ఎలిమినేషన్ ఉంటుందని టాక్. అయితే ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ జనాల ఓటింగ్ ప్రకారం కాకుండా హౌస్మేట్స్ నిర్ణయాన్ని బట్టి ఆదిత్య ఓంను బయటకు పంపించారు బిగ్‌బాస్‌. కానీ జనాల ఓటింగ్ ప్రకారం చూస్తే నైనిక అతి తక్కువ ఓట్లతో చివరి స్థానంలో ఉంది. ఆదిత్య ఓం మొత్తం నాలుగున్నర వారాలపాటు హౌస్ లో ఉన్నాడు.

హీరోగా జనాలకు సుపరిచితుడైన ఆదిత్యను ఈ షో ద్వారా మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువచ్చాడు బిగ్‌బాస్‌. అయితే ఈ షో కోసం ఆదిత్యకు భారీగానే ఆఫర్ చేశారట. వారానికి రూ.3 లక్షల పారితోషికం ఇచ్చారట. ఈ లెక్కన నాలుగున్నర వారాలకుగానూ దాదాపు రూ.14 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల కంటే ఎక్కువగానే రెమ్యునరేషన్ అందుకున్నాడట.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..