- Telugu News Photo Gallery Cinema photos Trisha acted in all the Kollywood movies that grossed Rs.200 crores in Tamil Nadu
Trisha Krishnan: రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన చెన్నై చంద్రం.. అదేంటంటే
కెరీర్ బిగినింగ్‌లో త్రిష సిమ్రాన్ ఫ్రెండ్‌గా ఓ సినిమా చేసింది. ఆతర్వాత మెల్లగా హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. ఆతర్వాత స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది త్రిష.
Updated on: Oct 05, 2024 | 1:31 PM

అందాల ముద్దుగుమ్మ త్రిష ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఒకానొక సమయంలో టాలీవుడ్ ను ఏలింది ఈ క్రేజీ హీరోయిన్. ఎక్కడ చూసినా త్రిష పేరే వినిపించేది. స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మెప్పించింది.

ఇండస్ట్రీలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ నుంచి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారిపోయింది త్రిష. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించింది. అందం అభినయం ఉన్న త్రిష డేట్స్ కోసం స్టార్ హీరోలు కూడా ఎదురుచూసేవారు.

త్వరలో విష్ణు వర్దన్ కెప్టెన్సీలో ది బుల్ మూవీని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాలో సల్మాన్‌కు జోడీగా సౌత్ బ్యూటీ త్రిషను ఫైనల్ చేశారు మేకర్స్. మరి ఈ సినిమా తరువాత త్రిష బాలీవుడ్‌లోనూ బిజీ అవుతారేమో చూడాలి.

తెలుగుతో పాటు తమిళ్‌లోనూ సినిమాలు చేసింది ఈ చిన్నది. ప్రస్తుతం త్రిష ఆచి తూచి సినిమాలు చేస్తోంది. ఇటీవలే పొన్నియన్ సెల్వన్, లియో సినిమాలతో హిట్స్ అందుకుంది. ప్రస్తుతం అజిత్ తో ఓ సినిమా టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తోంది త్రిష.

తాజాగా త్రిష ఓ క్రేజీ రికార్డ్ సొంతం చేసుకుంది. తమిళ్ లో రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన మూవీస్ అన్నింటిలో త్రిష ఉండటం విశేషం. ఇదొక రికార్డు అనే చెప్పాలి. ఇప్పుడు ఇదే టాపిక్ కోలీవుడ్ లో తెగ వినిపిస్తుంది.




