AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajamouli: ఎన్టీఆర్ ముందే రాజమౌళిని అవమానించిన బాలీవుడ్ ఇండస్ట్రీ ! వీడియో వైరల్.. అభిమానుల ఆగ్రహం

బాహుబలి’ సినిమాతో సౌత్ ఇండియన్ సినిమాలకు ఇంటర్నేషనల్ మార్కెట్‌కి తలుపులు తెరిచిన ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు ‘RRR’ సినిమాతో మరో అడుగు ముందుకేసి భారతీయ సినిమాలను ఆస్కార్ అవార్డుల్లో కూడా మెరిపించేలా చేశాడు. అలాంటి రాజమౌళిని ఇప్పుడు ఓ కామెడీ షోలో వెక్కిరించారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Rajamouli: ఎన్టీఆర్ ముందే రాజమౌళిని అవమానించిన బాలీవుడ్ ఇండస్ట్రీ ! వీడియో వైరల్.. అభిమానుల ఆగ్రహం
Rajamouli
Basha Shek
|

Updated on: Oct 02, 2024 | 4:24 PM

Share

ప్రస్తుతం భారతదేశపు టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భారతీయ సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు జక్కన్న. ‘బాహుబలి’ సినిమాతో సౌత్ ఇండియన్ సినిమాలకు ఇంటర్నేషనల్ మార్కెట్‌కి తలుపులు తెరిచిన ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు ‘RRR’ సినిమాతో మరో అడుగు ముందుకేసి భారతీయ సినిమాలను ఆస్కార్ అవార్డుల్లో కూడా మెరిపించేలా చేశాడు. అలాంటి రాజమౌళిని ఇప్పుడు ఓ కామెడీ షోలో వెక్కిరించారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే. బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ ఒక దశాబ్దం నుండి టీవీలో ‘కపిల్ శర్మ షో’ని హోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ టీవీ షో కాస్తా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీకి మారిపోయింది. ది కపిల్ షో కొత్త సీజన్ ఇటీవలే ప్రారంభమైంది. ఇటీవల ప్రసారమైన ఎపిసోడ్ లో ‘దేవర’ బృందం నుండి జూ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ జాన్వీ కపూర్ అతిథులుగా హాజయ్యారు. ఈ సమయంలో రాజమౌళిని కొందరు అవమానించేలా షో జరిగిందటూ కొందరు సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ షోకు వచ్చిన సెలబ్రిటీలను అనుకరిస్తూ ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తుంటాడు సునీల్ గ్రోవర్. ఇది ఈ కామెడీ షోకే హైలైట్ గా నిలిచింది. అలా తాజాగా ఎపిసోడ్ లో ఎన్టీఆర్ రాగానే సునీల్ గ్రోవర్ రాజమౌళిని అనుకరించాడు. అచ్చం జక్కన్న లాగే డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్‌తో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ, రాజమౌళి ని రాజగోళి అని పిలవడం, అలాగే ఒక కథ చెప్తాను, కమర్షియల్ సినిమా అంటూ ఒక లైన్ చెప్పడం ఆ తర్వాత మొత్తం VFX, VFX అని అనడం. అలా మొత్తం VFX లతోనే సినిమా తీస్తాను అన్నట్టు రాజమౌళిని కామెడీగా చూపించారు. ఇది రాజమౌళి అభిమానులకు, మరికొందరు తెలుగు సినీ ప్రియులకు నచ్చడంలేదు. దీంతో కపిల్ శర్మ షోపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ వాళ్ళు మాత్రం సునీల్ గ్రోవర్ కామెడీ అదిరింది అంటూ వీడియో వైరల్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైరలవుతోన్న వీడియో ఇదే..

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

రాజమౌళిగా సునీల్ గ్రోవర్.. మరో వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?