Tollywood: ఏయ్ బంటీ నీ సబ్బు స్లోనా ఏంటి? ఈ పాప గుర్తుందా.. ఇప్పుడు నడుమందాలతో
'ఏయ్ బంటీ నీ సబ్బు స్లోనా ఏంటి?' ఈ లైఫ్ బాయ్ యాడ్ మీకు గుర్తుందా.? అందులో నటించిన అమ్మాయి.. ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. బాలీవుడ్‌లో క్రేజీ బ్యూటీగా అందాలతో గత్తరలేపుతోంది.
‘ఏయ్ బంటీ నీ సబ్బు స్లోనా ఏంటి?’ ఈ లైఫ్ బాయ్ యాడ్ మీకు గుర్తుందా.? అందులో నటించిన అమ్మాయి.. ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. బాలీవుడ్‌లో క్రేజీ బ్యూటీగా అందాలతో గత్తరలేపుతోంది. చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు హీరోయిన్‌గా వరుసగా ఆఫర్లు సంపాదించింది. ఇంతకీ ఆ అమ్మాయి మరెవరో కాదు అవనీత్ కౌర్. అందంతో మెస్మరైజ్ చేస్తోన్న అవనీత్ కౌర్.. ‘డ్యాన్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్’ ప్రోగ్రామ్ తో కెరీర్ స్టార్ట్ చేసింది. తర్వాత చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో టీవీ సీరియల్స్, షోస్‌లో నటించింది. అలాగే ‘లైఫ్ బాయ్’, ‘మ్యాగీ’, ‘హిందుస్తాన్ లివర్’ వంటి 40కిపైగా టాప్ బ్రాండ్ యాడ్స్‌లో నటించింది.
2014లో ‘మర్దానీ’ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చింది అవనీత్ కౌర్. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. ఆమెకు మంచి గుర్తింపు రాలేదు. గతేడాది ‘టికు వెడ్స్ షేరు’, ‘లవ్ కి అరేంజ్ మ్యారేజ్’ చిత్రాలతో క్రేజీ బ్యూటీగా బీ-టౌన్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఇక ఇప్పుడు ‘లవ్ ఇన్ వియత్నాం’ అనే చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ‘చంద్రనందిని’ సీరియల్ అవనీత్ కౌర్‌కు నటనకు పరంగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సీరియల్‌లో విలన్ క్యారెక్టర్‌లో చేసిన ఈమె.. తన నటనలోని మరో కోణాన్ని చూపించింది. కాగా, ఈ బ్యూటీకి ఇన్‌స్టాలో ఫాలోవర్స్ రోజురోజుకూ పెరుగుతూపోతున్నారు. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో ఈ బ్యూటీ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. లేట్ ఎందుకు ఆ ఫోటోలపై ఓ లుక్కేయండి మరి.
ఇది చదవండి: ఒకప్పటి స్టార్ కమెడియన్.. ఇప్పుడు ఇలా మారిపోయిందేంటి.. ఎవరో తెల్సా
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి