Tollywood: ఒకప్పటి స్టార్ కమెడియన్.. ఇప్పుడు ఇలా మారిపోయిందేంటి.. ఎవరో తెల్సా

పైన పేర్కొన్న ఫోటోలోని నటిని గుర్తుపట్టారా.? ఈమె ఒకప్పటి లేడీ కమెడియన్.. దాదాపుగా 200కిపైగా చిత్రాల్లో నటించింది. ఒక్క కమెడియన్‌గా మాత్రమే కాదు.. హీరోయిన్‌గా, సెకండ్ హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా వివిధ పాత్రల్లో నటించి..

Tollywood: ఒకప్పటి స్టార్ కమెడియన్.. ఇప్పుడు ఇలా మారిపోయిందేంటి.. ఎవరో తెల్సా
Tollywood
Follow us

|

Updated on: Oct 01, 2024 | 1:31 PM

పైన పేర్కొన్న ఫోటోలోని నటిని గుర్తుపట్టారా.? ఈమె ఒకప్పటి లేడీ కమెడియన్.. దాదాపుగా 200కిపైగా చిత్రాల్లో నటించింది. ఒక్క కమెడియన్‌గా మాత్రమే కాదు.. హీరోయిన్‌గా, సెకండ్ హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా వివిధ పాత్రల్లో నటించి.. ఎంతోమంది అభిమానులను సంపాదించింది. 1980వ దశకంలో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది ఈ హీరోయిన్. ఈమె మన తెలుగమ్మాయ్ అయినప్పటికీ.. మలయాళ ఇండస్ట్రీ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి పరిచయమైంది. ఇంతకీ ఆమె ఎవరా అని అనుకుంటున్నారా.?

ఆమె మరెవరో కాదు.. అనూజ రెడ్డి. ఈమె గుంటూరులో జన్మించింది. అయితే ఆమెకు మూడేళ్లు ఉన్నప్పుడే కుటుంబం చెన్నైకి వెళ్లి స్థిరపడింది. ఇక అనూజ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేసరికి 14 ఏళ్లు మాత్రమే. చెన్నైలోని కోడంబాక్కంలో చిత్ర యూనిట్ ఓ సినిమాలో తెలుగు అమ్మాయి కోసం వెతుకుతుండగా.. వారు అనూజను చూడటం వెంటనే ఎంపిక చేయడం జరిగిపోయిందట. అప్పట్లో బ్రహ్మానందం, అనూజ కాంబినేషన్‌లో వచ్చిన ప్రతీ కామెడీ సీన్ ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ‘చంటి’, ‘పెళ్లి చేసుకుందాం’ వంటి సినిమాల్లో అనూజ తనదైన శైలి నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2004లో చివరిసారి అనూజ రెడ్డి సిల్వర్ స్క్రీన్‌పై కనిపించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది అనూజ. తన వ్యక్తిగత విషయాలను ఇన్‌స్టా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అప్పట్లో కామెడీతో అలరించిన ఈమె.. ఇప్పుడేంటి ఇలా మారిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మీరూ ఓసారి ఫోటోలపై లుక్కేయండి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Anuja Reddy (@anuja613)

View this post on Instagram

A post shared by Anuja Reddy (@anuja613)

ఇది చదవండి:  పంజా మూవీ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా.? పిచ్చెక్కించేంత హాట్‌గా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి