Tollywood: ఫోటో చూసి ట్రోల్ చేయకండి.. ఇప్పుడు ఆమె అందాన్ని చూస్తే మతిపోవాల్సిందే.. ఎవరో తెలుసా..
ఫోటోను చూశారు కదా.. అబ్బాయిగా కనిపిస్తున్న ఆ అమ్మాయి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. ఇన్నాళ్లు భారతీయ సినీ పరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఈ అందాల రాశి.. ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తుంది. అక్కడ వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంటుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నారు.. ?
సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరోయిన్ 9 ఏళ్లు ఉన్నప్పటి ఫోటో తెగ ట్రెండ్ అవుతుంది. తన చిన్నప్పటి ఫోటోతోపాటు తాను సినీరంగంలోకి అడుగుపెడుతున్నప్పటి ఫోటోనూ షేర్ చేస్తూ ఫాలోవర్లకు వార్నింగ్ ఇచ్చింది ఈ హీరోయిన్. తన లుక్ పై ట్రోల్స్ చేయొద్దంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ బ్యూటీ షేర్ చేసిన ఫోటో మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. అబ్బాయిగా కనిపిస్తున్న ఆ అమ్మాయి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. ఇన్నాళ్లు భారతీయ సినీ పరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఈ అందాల రాశి.. ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తుంది. అక్కడ వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంటుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నారు.. ? తనే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.
2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుని స్టార్ హీరోయిన్గా ఎదిగింది ప్రియాంక చోప్రా. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం సినీరంగుల ప్రపంచంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ తనే. తాజాగా తాను 9ఏళ్ల వయసులో ఉన్నప్పటి ఫోటోతోపాటు మిస్ వరల్డ్ గా గెలిచినప్పటి ఫోటో షేర్ చేస్తూ ట్రోల్ చేయొద్దని రాసుకొచ్చింది.
“అమ్మాయి లుక్ ఆమె ధరించిన దుస్తులపై ఆధారపడి ఉంటుంది. ఇందులో మొదటి ఫోటో తీసిన సమయంలో నాకు 9 ఏళ్లు. అప్పుడు క్రాఫ్ లో అబ్బాయిలా ఉన్నాను. చిన్న పిల్లనే కాబట్టి స్కూల్లో ఇబ్బందులు ఎదురుకాలేదు. రెండో ఫోటోలో 17 ఏళ్లు. మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న రోజుల్లో తీసిన ఫోటో. ఆరోజులు ఇంకా గుర్తున్నాయి. అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. 25 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితం చాలా సంతోషంగా ఉందో తెలుస్తోంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఈరోజు మీరు ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడి ఉంటారు. దానిని స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగండి. మీ చిన్నప్పటి ఫోటోను రీసెంట్ పిక్ తో పోలుస్తూ కామెంట్స్ చేయండి” అంటూ రాసుకొచ్చింది ప్రియంక.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.