Chandramukhi: అయ్యా బాబోయ్.. ఈ అమ్మాయి ‘చంద్రముఖి’ మూవీ చైల్డ్ ఆర్టిస్టా..? ఇప్పుడు ఏ రేంజ్లో మారిపోయిందంటే..
అలాగే జ్యోతిక, నయన్, ప్రభు తన నటనతో మంచి మార్కులు కొట్టేశారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఓ చిన్నారి కనిపిస్తుంది గుర్తుందా..? అదేనండి.. ఈ మూవీలోని 'అత్తింధోం.. ' పాటలో రజినీతో కలిసి పాట పాడేస్తుంది.. ముద్దుగా, బొద్దుగా కనిపిస్తూ తలైవాతో కలిసి సందడి చేస్తుంది. ఆ చిన్నారి పేరు ప్రహర్షిత శ్రీనివాసన్. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఆ చిన్నారి చాలా ఫేమస్.
చంద్రముఖి.. సౌత్ అడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేని సినిమా. హారర్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ఇప్పటికీ అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయింది. అంతేకాదు ఈ సినిమాలోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. 2005లో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు పీ.వాసు దర్శకత్వం వహించారు. ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించగా.. నయనతార, జ్యోతిక, ప్రభు, నాజర్, వడివేలు కీలకపాత్రలు పోషించారు. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన ఈ సినిమా ఇప్పుడు టీవీల్లో వస్తుందంటే చాలు జనాలు టీవీలకే అతుక్కుపోతారు. అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది ఈ సినిమా. ఇందులో రజినీకాంత్, వడివేలు మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ గురించి చెప్పక్కర్లేదు. అలాగే జ్యోతిక, నయన్, ప్రభు తన నటనతో మంచి మార్కులు కొట్టేశారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఓ చిన్నారి కనిపిస్తుంది గుర్తుందా..? అదేనండి.. ఈ మూవీలోని ‘అత్తింధోం.. ‘ పాటలో రజినీతో కలిసి పాట పాడేస్తుంది.. ముద్దుగా, బొద్దుగా కనిపిస్తూ తలైవాతో కలిసి సందడి చేస్తుంది. ఆ చిన్నారి పేరు ప్రహర్షిత శ్రీనివాసన్. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఆ చిన్నారి చాలా ఫేమస్.
చైల్డ్ ఆర్టిస్టుగా తమిళంలో అనేక సినిమాలు, సీరియల్స్ చేసింది. కానీ చంద్రముఖి సినిమాతోనే ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఒక్క సినిమాతోనే సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రహర్షిత.. చంద్రముఖి సినిమా తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు. దాదాపు 18 ఏళ్లకు నటనకు దూరంగా ఉన్న ప్రహర్షిత.. ఇప్పుడు బుల్లితెరపై ఓ సీరియల్లో నటిస్తుంది. అలాగే ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వరుసగా ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది. అప్పట్లో ముద్దుగా బొద్దుగా కనిపించిన ఆ చిన్నారిని ఇప్పుడు మరింత అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
ఇదిలా ఉంటే.. ప్రహర్షితకు వివాహం జరిగినట్లుగా తెలుస్తోంది. 2021లోనే పెళ్లి చేసుకున్న 2022లో ఓ పాపకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తన భర్తతో, కూతురితో దిగిన ఫోటోస్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రహర్షిత ఫోటోస్, వీడియోస్ చూసి రకారకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.