Tollywood: వార్నీ.. ఏం ఛేంజ్ గురూ.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‏గా.. మతిపోగొట్టేస్తోన్న యాంకరమ్మ..

ఫోటోను చూశారు కదా..పద్దతిగా కనిపిస్తున్న ఆ అమ్మాయి కూడా యాంకరే. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు రియాల్టీ షోలలో యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు ప్రైవేట్ సాంగ్స్, మూవీస్ చేస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉంటుంది. యాంకర్ గా తన అందంతో చలాకీతనంతో మెప్పిస్తుంది. ఇంతకీ పైన ఫోటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా..?

Tollywood: వార్నీ.. ఏం ఛేంజ్ గురూ.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‏గా.. మతిపోగొట్టేస్తోన్న యాంకరమ్మ..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 22, 2024 | 8:02 AM

బుల్లితెరపై అందం, అభినయంతోనే కాదు.. అల్లరి, మాటల గారడితో ప్రేక్షకులను అలరించడంలో యాంకర్స్ ముందుంటారు. తెలుగులో సుమ కనకాల, ప్రదీప్ మాచిరాజు యాంకరింగ్ గురించి చెప్పక్కర్లేదు. షోలలో తమదైన కామెడీ పంచులతో నవ్వులు పూయిస్తారు. అలాగే మరికొంత మంది యాంకర్స్ కూడా తమదైన స్టైల్లో అలరిస్తుంటారు. పైన ఫోటోను చూశారు కదా..పద్దతిగా కనిపిస్తున్న ఆ అమ్మాయి కూడా యాంకరే. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు రియాల్టీ షోలలో యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు ప్రైవేట్ సాంగ్స్, మూవీస్ చేస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉంటుంది. యాంకర్ గా తన అందంతో చలాకీతనంతో మెప్పిస్తుంది. ఇంతకీ పైన ఫోటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా..? ఇప్పుడు బిగ్‏బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్ ఆ అమ్మాయి. తనే యాంకర్ విష్ణుప్రియ.

మొదట్లో షార్ట్ ఫిల్మ్స్ చేసింది విష్ణుప్రియ. ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్ గా మారి ప్రేక్షకులను అలరించింది. పోవే పోరా షోతో యాంకర్ గా సినీ ప్రయాణంలో కెరీర్ స్టార్ట్ చేసిన విష్ణు.. తక్కువ సమయంలోనే చాలా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత పలు షోలలోనూ యాంకరింగ్ చేస్తూ తెలుగువారికి దగ్గరయ్యింది. అలాగే ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది. ఇటీవలే సంతోష్ శోభన్ నటించిన బేకర్ అండ్ ది బ్యూటీ చిత్రంలో నటించింది. ఓవైపు యాంకరింగ్ చేస్తున్న విష్ణు.. ఇటు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్. నిత్యం ఫోటోషూట్స్, రీల్స్ అంటూ తెగ హడావిడి చేస్తుంది. అలాగే ప్రైవేట్ సాంగ్స్ ఆల్బమ్స్ తో ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం విష్ణు బిగ్‏బాస్ సీజన్ 8 రియాల్టీ షోలో కంటెస్టెంట్. మొదటి వారం నుంచే తన ఆట తీరు, ప్రవర్తనతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ సీజన్ అత్యంత డిమాండ్ ఉన్న కంటెస్టెంట్ విష్ణు. నివేదికల ప్రకారం ఈ సీజన్ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ కూడా విష్ణు కావడం విశేషం. ఆమెకు వారానికి రూ.5.5 లక్షలు చెల్లిస్తున్నారని తెలుస్తోంది. రోజు రోజుకు విష్ణుకు అడియన్స్ సపోర్ట్ పెరుగుతుంది. అంతేకాదు.. ఈ సీజన్ టాప్ 5 కంటెస్టెంట్ కూడా అని అంటున్నారు. ప్రస్తుతం విష్ణుకు సంబంధించిన చిన్ననాటి ఫోటో నెట్టింట ట్రెండ్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..
అన్‌సోల్డ్ ఆడిన మ్యాజిక్: ఐపీఎల్ వేలం మిస్.. షాక్ లో కావ్య పాపా
అన్‌సోల్డ్ ఆడిన మ్యాజిక్: ఐపీఎల్ వేలం మిస్.. షాక్ లో కావ్య పాపా