Harsha Sai: డబ్బు కోసమే తప్పుడు ఆరోపణలు.. అందుకు నిరాకరించడంతోనే కేసు పెట్టింది.. హర్షసాయి న్యాయవాది చిరంజీవి
హర్షసాయితోపాటు అతడి కుటుంబాన్ని కూడా విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా.. తన ఫ్యామిలీ కూడా అందుబాటులో లేదని తెలుస్తోంది. తాజాగా తన పై వచ్చిన ఆరోపణల పట్ల మొదటిసారిగా హర్షసాయి స్పందించారు. కేవలం డబ్బుల కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని.. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ పెట్టాడు.

సోషల్ మీడియా స్టార్ హర్ష సాయి పై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడని.. ఆపై నగ్న చిత్రాలు సేకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ ఓ యువతి హర్షసాయి పై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై 328, 376 (2) 354 , 376ఎన్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే భాదిత యువతి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు.. సదరు యువతి వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి హర్షసాయి పోలీసుల ముందుకు రాకపోవడంతో అతడి కోసం గాలింపు చేపట్టారు. హర్షసాయితోపాటు అతడి కుటుంబాన్ని కూడా విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా.. తన ఫ్యామిలీ కూడా అందుబాటులో లేదని తెలుస్తోంది. తాజాగా తన పై వచ్చిన ఆరోపణల పట్ల మొదటిసారిగా హర్షసాయి స్పందించారు. కేవలం డబ్బుల కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని.. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ పెట్టాడు.
“ఇవన్నీ తప్పుడు ఆరోపణలు… డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారు. మీకు నా గురించి తెలుసు. త్వరలోనే నిజం బయటకు వస్తుంది. నా న్యాయవాది ఈ విషయాన్ని చూసుకుంటారు” అంటూ ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ పెట్టాడు హర్షసాయి. డబ్బు కోసమే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు హర్షసాయి న్యాయవాది చిరంజీవి అన్నారు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆయన ఈ కేసులో యువతి చేస్తున్న ఆరోపణలు అన్ని అబద్దాలే అన్నారు. ప్రేమ, పెళ్లి అన్నీ అబద్ధాలే అని.. హర్షసాయి సక్సెస్‌ను చూడలేకే నిందలు వేస్తున్నారని అన్నారు. రెండేళ్లక్రితం హర్షసాయిని సదరు యువతి కలిసిందని.. ఏడాదిన్నరగా ఇద్దరికీ సంబంధాల్లేవని అన్నారు. కానీ ఓ పాటలో నటించాలని హర్షసాయిని కోరిందని.. అందుకు నిరాకరించడంతోనే అతడి పై కేసు పెట్టిందని.. హర్షసాయి, అతని తండ్రిని ఆమె బ్లాక్‌మెయిల్ చేసింది అన్నారు.
సినిమాల్లో అవకాశాల కోసం తాను ముంబాయి నుంచి హైదరాబాద్ వచ్చానని.. ఈ క్రమంలోనే ఓ రియాల్టీ షోలో పాల్గొన్నానని.. ఆ తర్వాత ప్రైవేట్ పార్టీలో హర్షసాయితో తనకు పరిచయం ఏర్పడిందని సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. తనను ప్రేమించానని.. పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని.. పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని.. ఇప్పుడు నగ్నచిత్రాలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ సదరు యువతి పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది. దీంతో హర్షసాయి పై ఆత్యాచారం కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు.
హర్షసాయి.. సోషల్ మీడియాలో చాలా ఫేమస్. అతడికి యూట్యూబ్ లో దాదాపు 14 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే అతడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నాడంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

Harsha Sai