- Telugu News Photo Gallery Cinema photos Actress Bhavana Menon Shares Emotional Post About Her father 9th Death Anniversary
Bhavana Menon: సమయం గాయాలను నయం చేస్తుంది అంటారు.. కానీ అది నిజం కాదు.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్..
సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోయిన్ భావన మీనన్. తెలుగుతోపాటు తమిళం, మలయాళంలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో అందం, అభినయంతో వెండితెరపై మాయ చేసింది భావన. ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులను మెప్పించింది. కానీ అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యింది ఈ బ్యూటీ. చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న భావన.. తాజాగా తన ఇన్ స్టాలో ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది.
Updated on: Sep 25, 2024 | 11:46 AM

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోయిన్ భావన మీనన్. తెలుగుతోపాటు తమిళం, మలయాళంలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో అందం, అభినయంతో వెండితెరపై మాయ చేసింది భావన. ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులను మెప్పించింది.

కానీ అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యింది ఈ బ్యూటీ. చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న భావన.. తాజాగా తన ఇన్ స్టాలో ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. తన తండ్రిని గుర్తుచేసుకుంటూ అతడితో దిగిన ఫోటోను పంచుకుంటూ భావోద్వేగ పోస్ట్ చేసింది భావన.

ఆమె తండ్రి మరణించి తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా "పోరాడుతూనే ఉండండి.. స్వర్గంలో ఉన్న వ్యక్తి మీరు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. సమయం అన్ని గాయాలను నయం చేస్తుందని చాలా మంది అంటారు. కానీ అది నిజం కాదు" అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

నాన్న... ప్రతి క్షణం నిన్ను మిస్ అవుతున్నాం. గడిచే ప్రతి రోజు, ప్రతి ఒడిదుడుకుల్లో... మీరు ఎల్లప్పుడూ మా హృదయాల్లో ఉంటారు అని భావన పేర్కొంది. ఆమె తన నటనా జీవితంలో స్టార్‌కి అవసరమైన మద్దతునిచ్చింది ఆమె తండ్రి బాలచంద్ర. కానీ ఆమె తండ్రికి ఆకస్మాత్తుగా రక్తపోటు పెరగడంతో వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రాణాలను కాపాడుకోలేకపోయారు.

తన తండ్రి మరణం వల్ల కలిగిన గాయం చనిపోయే వరకు ఉంటుందని గతంలో చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. భావన ప్రొడ్యూసర్ నవీన్ ను 22 జనవరి 2018 న ప్రేమ వివాహం చేసుకున్నారు. అంతకు ముందు ఐదేళ్లు వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. ప్రస్తుతం తన భర్తతో కలిసి బెంగుళూరులో స్థిరపడింది భావన.




