- Telugu News Photo Gallery Cinema photos Heroine Sreeleela talk about Love and marriage Rumors, details here
Sreeleela: మనసులో మాటలు బయటపెడుతున్న మిస్ లీల.! వీలైనంతగా వార్తల్లోనే..
కనిపించడం లేదు.. అనే పదాన్ని కనిపించకుండా చేయాలనుకుంటున్నారు నటి శ్రీలీల. అందుకే వీలైనంతగా వార్తల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా ఆమె ఇండస్ట్రీ గురించి, కాంపిటిషన్ గురించి చెప్పిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. అసలు ఇండస్ట్రీలో పోటీతత్వం ఉండనే ఉండదని అంటున్నారు ఈ బ్యూటీ. తాను సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నప్పటి నుంచీ ఎవరినీ పోటీగా ఫీలవలేదట మిస్ లీల.
Updated on: Sep 25, 2024 | 12:20 PM

కనిపించడం లేదు.. అనే పదాన్ని కనిపించకుండా చేయాలనుకుంటున్నారు నటి శ్రీలీల. అందుకే వీలైనంతగా వార్తల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇప్పుడంటే శ్రీలీల బజ్ కాస్త తగ్గింది కానీ, లాస్ట్ ఇయర్ చూడాల్సింది ఆమె స్టేటస్‌ని. ఏస్టార్ హీరో సెట్‌లో చూసినా ఆమే కనిపించేది.

తాను సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నప్పటి నుంచీ ఎవరినీ పోటీగా ఫీలవలేదట మిస్ లీల. ఎవరి ప్రతిభకు తగ్గట్టు వారికి ఆఫర్లు వస్తూనే ఉంటాయని అంటున్నారు.

అంతే కాదు, సినిమా ఇండస్ట్రీని పుష్పక విమానంతో పోలుస్తున్నారు ఈ భామ. సినిమా సినిమాకూ తనలో ఉన్న టాలెంట్‌ని మెరుగుపరచుకోవాలన్నది మాత్రమే తన లక్ష్యమని అంటున్నారు శ్రీలీల.

ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటే, ఏ ఇండస్ట్రీలోనైనా టాప్‌లో కొనసాగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

తన సహ నటీమణుల్లో ఎవరైనా బాగా నటిస్తే వాళ్లను మెచ్చుకోవడంలో తానెప్పుడూ ముందే ఉంటానన్నది శ్రీలీల స్టేట్‌మెంట్.

అంతే కాదు, వాళ్లతో పోటీ పడాలనో, వాళ్ల అవకాశాల గురించి ఆరా తీయాలనో తనకెప్పుడూ అనిపించదట. తనిలా ఆలోచిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంటుందని అంటున్నారు ఈ లేడీ.




