OTT Movie: ఓటీటీలోకి మలయాళీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే..

డైరెక్టర్ ఉల్లాస్ చంబన్ దర్శకత్వం వహించిన సినిమా అంచక్కల్లకోక్కన్. ఈ ఏడాది మార్చి 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కానీ కేవలం మలయాళం వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉండేది.

OTT Movie: ఓటీటీలోకి మలయాళీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే..
Chapra Murder Case
Follow us

|

Updated on: Sep 24, 2024 | 7:21 AM

ఇటీవల కొన్ని రోజులుగా మలయాళీ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా హారర్, మర్డరీ మిస్టరీ కంటెంట్ చూసేందుకు మూవీ లవర్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు మరో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. డైరెక్టర్ ఉల్లాస్ చంబన్ దర్శకత్వం వహించిన సినిమా అంచక్కల్లకోక్కన్. ఈ ఏడాది మార్చి 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కానీ కేవలం మలయాళం వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులోనూ చూడొచ్చు. అంచక్కల్లకోక్కన్ సినిమాను ఇప్పుడు తెలుగులో చాప్రా మర్డర్ కేస్ పేరుతో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25 నుంచి ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది ఆహా ఓటీటీ. ఇప్పటికే ఇదే విషయంపై అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది.

అంచక్కల్లకోక్కన్ సినిమా మలయాళీ వెర్షన్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇప్పుడు అదే సినిమాను తెలుగులో చాప్రా మర్డర్ కేస్ పేరుతో తెలుగులోకి తీసుకువస్తుంది ఆహా. ఈ సినిమాలో లుక్ మన్ అవరన్, చెంబన్ వినోద్ జోస్, మణికందన్ ఆర్ ఆచారి, మేఘా థామస్, మెరిన్ మేరీ ఫిలిప్ , శ్రీజిత్ రవి, సెంథిల్ కృష్ణ కీలకపాత్రలు పోషించారు. ఓ మర్డర్ కేసును పోలీసులు ఛేదించడం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చెంబోస్కి మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై చెంబన్ వినోద్ జోస్ నిర్మించగా.. బాక్సాఫీస్ వద్ద రూ.55 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

కథ విషయానికి వస్తే.. కేరళ, కర్ణాటక సరిహద్దు గ్రామంలో భూస్వామి అయిన చాప్రా (శ్రీజత్ రవి) హత్యకు గురవుతారు. అప్పుడే అక్కడికి పోలీస్ స్టేషన్ కు వాసుదేవన్ (లుక్మన్ అవరన్) కానిస్టేబుల్ గా వస్తాడు. అలాగే హెడ్ కానిస్టేబుల్ నందవరంబన్ పీటర్ (చెంబన్ వినోద్ జోస్) తో కలిసి చాప్రా హత్య కేసును ఎలా చేధిస్తారు.. ? అసలు చాప్రాను చంపిందెవరు ? అనేది సినిమా. ఈ మూవీ ఆహా ఓటీటీలో సెప్టెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.