AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kill Movie: తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ‘కిల్’.. ఎక్కడ చూడొచ్చంటే..

ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. సెప్టెంబర్ 6 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ 20 రోజులుగా కేవలం హిందీలోనే అందుబాటులో ఉన్న ఈ సినిమా ఇప్పుడు తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది.

Kill Movie: తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న 'కిల్'.. ఎక్కడ చూడొచ్చంటే..
Kill Movie
Rajitha Chanti
|

Updated on: Sep 24, 2024 | 12:42 PM

Share

ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన సినిమాల్లో ‘కిల్’ ఒకటి. ఈ ఏడాది మోస్ట్ వయోలెంట్ మూవీగా పేరు తెచ్చుకున్న ఈ సినిమా జూలై 5న థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించింది. ఇందులో అడియన్స్ ఊహించని ట్విస్టులు, వణుకుపుట్టించే సీన్స్ తో ఆద్యంతం క్యూరియాసిటిని కలిగించిన ఈ సినిమాకు థియేటర్లలో ఓ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. సెప్టెంబర్ 6 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ 20 రోజులుగా కేవలం హిందీలోనే అందుబాటులో ఉన్న ఈ సినిమా ఇప్పుడు తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది.

సెప్టెంబర్ 24 నుంచి తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలోనూ ‘కిల్’ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అత్యంత హింసాత్మక సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వరకు వసూలు చేసింది. ఇప్పటికే ఈ సినిమాలో హింస ఎక్కువగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. కానీ అటు బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో లక్ష్ లాల్వానీ, తాన్య మనక్తి ప్రదాన పాత్రలు పోషించారు. గతేదాడి సెప్టెబంర్ నెలలో తొలిసారి టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించిన సినిమా ఇది.

కథ విషయానికి వస్తే.. కిల్ సినిమా ఎక్కువగా రైల్లోనే సాగే యాక్షన్ థ్రిల్లర్. ఢిల్లీ నుంచి రాంచీకి వెళ్లే రైలులో బంధిపోట్లు చేసిన దాడి.. వారి దాడిని హీరో ఎలా తిప్పుకొట్టాడు.. బందిపోట్ల దాడిలో హీరోయిన్, ఆమె కుటుంబానికి ఏం జరిగింది ? అనేది సినిమా. ఈ చిత్రానికి డైరెక్టర్ నిఖిల్ నగేశ్ భట్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో అమిత్ రాథోజ్ (ఆర్మీలో ఎన్ఎస్జీ కమాండర్)గా లక్ష్య లల్వానీ నటించగా.. అతడి ప్రేయసి తులికా పాత్రలో తన్య మనిక్తలా నటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.
గ్రహాల రాజు మారుతున్నాడు.. ఆ రాశులకు జాక్ పాట్!
గ్రహాల రాజు మారుతున్నాడు.. ఆ రాశులకు జాక్ పాట్!
Bedi Hanuman Temple: హనుమంతుడ్ని గొలుసులతో బంధించింది ఎవరు?
Bedi Hanuman Temple: హనుమంతుడ్ని గొలుసులతో బంధించింది ఎవరు?
ఇన్యూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోకపోతే బొక్కబోర్లా
ఇన్యూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోకపోతే బొక్కబోర్లా
వందే భారత్ రైళ్లపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చిన రైల్వేశాఖ
వందే భారత్ రైళ్లపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చిన రైల్వేశాఖ