- Telugu News Photo Gallery Cinema photos Guess The Actress In This Photo She Is Malayalam Heroine Manjima Mohan Childhood Photo
Tollywood: ఆ స్టార్ హీరోను ప్రేమ పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఈ బబ్లీ బ్యూటీ ఎవరో తెలుసా..?
పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నది మలయాళఈ చిత్రపరిశ్రమలో ఓస్టార్ హీరోయిన్. అలాగే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది ఒక్క సినిమా అయిన తన క్యూట్ నటనతో ఆకట్టుకుంది. ఇంతకీ ఆమె ఎవరో అనుకుంటున్నారా..? తనే హీరోయిన్ మంజిమా మోహన్.
Updated on: Sep 22, 2024 | 12:08 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నది మలయాళఈ చిత్రపరిశ్రమలో ఓస్టార్ హీరోయిన్. అలాగే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది ఒక్క సినిమా అయిన తన క్యూట్ నటనతో ఆకట్టుకుంది. ఇంతకీ ఆమె ఎవరో అనుకుంటున్నారా..? తనే హీరోయిన్ మంజిమా మోహన్

చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టిన మంజిమా కేరళ రాష్ట్ర ఉత్తమ బాల నటి అవార్డ్ అందుకుంది. ఇక ఆ తర్వాత హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే కోలీవుడ్ హీరో గౌతమ్ కార్తిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి వివాహం 2022లో గ్రాండ్ గా జరిగింది. అంతకు ముందు 2019లో ఇద్దరు కలిసి దేవరత్తం అనే చిత్రంలో నటించారు.

పెళ్లి తర్వాత మంజిమా మోహన్ సినిమాలకు దూరంగా ఉన్నాడు. కానీ ఆమె భర్త మాత్రం సినిమాల్లో నటిస్తున్నాడు. కడలి సినిమా ద్వారా మంజిమా భర్త కార్తీక్ కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.

ప్రస్తుతం మంజిమా సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో వరుస ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. అక్కినేని నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది.

ఆ స్టార్ హీరోను ప్రేమ పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఈ బబ్లీ బ్యూటీ ఎవరో తెలుసా..?





























