AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prathinidhi 2 OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి నారా రోహిత్ ‘ప్రతినిధి 2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

చాలా గ్యాప్ తర్వాత నారా రోహిత్ కథానాయకుడిగా కనిపించిన సినిమా ప్రతినిధి 2. సుమారు పదేళ్ల క్రితం రిలీజై సంచలన విజయం సాధించిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్ గా ఇది తెరకెక్కింది. మూర్తి దేవగుప్తపు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. పార్ట్ 1 సూపర్ సక్సెస్ కావడంతో. పార్ట్ 2 టీజర్, ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండడంతో ప్రతినిధి 2పై బాగానే హైప్ క్రియేట్ అయ్యింది.

Prathinidhi 2 OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి నారా రోహిత్ 'ప్రతినిధి 2'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Prathinidhi 2 Movie
Basha Shek
|

Updated on: Sep 23, 2024 | 7:31 PM

Share

చాలా గ్యాప్ తర్వాత నారా రోహిత్ కథానాయకుడిగా కనిపించిన సినిమా ప్రతినిధి 2. సుమారు పదేళ్ల క్రితం రిలీజై సంచలన విజయం సాధించిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్ గా ఇది తెరకెక్కింది. మూర్తి దేవగుప్తపు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. పార్ట్ 1 సూపర్ సక్సెస్ కావడంతో. పార్ట్ 2 టీజర్, ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండడంతో ప్రతినిధి 2పై బాగానే హైప్ క్రియేట్ అయ్యింది. అయితే అభిమానుల అంచనాలు అందుకోవడంలో ప్రతనిధి 2 సినిమా ఫెయిల్ అయ్యింది. మే 10న థియేటర్లలో విడుదలైన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది. దీంతో చాలా మంది ఓటీటీలో చూద్దామని ఫిక్స్ అయ్యారు. అయితే థియేటర్లలో రిలీజైన ఇన్ని రోజులకు గానీ ప్రతినిధి 2 సినిమా ఓటీటీలోకి రాలేదు. అయితే ఎట్టకేలకు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై అప్ డేట్ వచ్చింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఓటీటీ నారా రోహిత్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ హక్కులను సొంతం చేసుకుంది. సెప్టెంబర్‌ 27 నుంచి ప్రతినిధి2 సినిమాను ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆహా. ‘ప్రశ్నించేందుకు ప్రతినిధి 2 వస్తున్నాడు. ఆహాలోసెప్టెంబర్ 27 నుంచి డిజిటల్ ప్రీమియర్ కానుంది’ అని సినిమా పోస్టర్ ను పంచుకుంది ఆహా.

కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని ప్రతినిధి 2 సినిమాను నిర్మించారు. నారా రోహిత్‌తో పాటు సిరీ లెల్ల,సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ ఘోష్, అజయ్, పృధ్వీ రాజ్, రఘుబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మ‌ణిశ‌ర్మ త‌న‌యుడు మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ ఈ పొలిటికల్ థ్రిల్ల‌ర్ మూవీకి సంగీతం అందించాడు.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్..

ప్రతినిధి 2 ట్రైలర్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.
గ్రహాల రాజు మారుతున్నాడు.. ఆ రాశులకు జాక్ పాట్!
గ్రహాల రాజు మారుతున్నాడు.. ఆ రాశులకు జాక్ పాట్!
Bedi Hanuman Temple: హనుమంతుడ్ని గొలుసులతో బంధించింది ఎవరు?
Bedi Hanuman Temple: హనుమంతుడ్ని గొలుసులతో బంధించింది ఎవరు?
ఇన్యూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోకపోతే బొక్కబోర్లా
ఇన్యూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోకపోతే బొక్కబోర్లా
వందే భారత్ రైళ్లపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చిన రైల్వేశాఖ
వందే భారత్ రైళ్లపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చిన రైల్వేశాఖ