Abhai Naveen: బిగ్ బాస్ అభయ్ లవ్ స్టోరీ గురించి తెలుసా? భార్య, కూతురు ఎంత క్యూట్‌గా ఉన్నారో?
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ మూడో వారం పూర్తయి నాలుగో వారంలోకి వచ్చింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగు పెడితే ఇప్పటికే ముగ్గురు సూట్ కేసు సర్దుకున్నారు. మొదటి వారం బెజవాడ బేబక్క, రెండో వారం శేఖర్ బాషా ఎలిమినేట్ కాగా.. మూడో వారం అభయ్ నవీన్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు.
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ మూడో వారం పూర్తయి నాలుగో వారంలోకి వచ్చింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగు పెడితే ఇప్పటికే ముగ్గురు సూట్ కేసు సర్దుకున్నారు. మొదటి వారం బెజవాడ బేబక్క, రెండో వారం శేఖర్ బాషా ఎలిమినేట్ కాగా.. మూడో వారం అభయ్ నవీన్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన అభయ్ హీరోగా, డైరెక్టర్ గానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా పెళ్లి చూపులు సినిమాలో తన కామెడీ టైమింగ్ కు అందరూ ఫిదా అయ్యారు.ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో హీరో ఫ్రెండ్ గా నటించి మెప్పించాడు. ఆ తర్వాత హీరోగానూ, డైరెక్టర్ గానూ మారి అదృష్టం పరీక్షించుకున్నాడు. ఇదే క్రేజ్ తో బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టాడు. కానీ మూడో వారంలోనే బయటకు వచ్చేశాడు. తను బిగ్ బాస్ లో నిజాయితీగా ఆడాను అని, తనకు సపోర్ట్ చేసిన వారికి ధన్యవాదాలు అంటూ తన బిగ్ బాస్ జర్నీ పై ఓ వీడియో షేర్ చేసాడు అభయ్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. కాగా అభయ్ బయటకు వచ్చాక అతని ఫ్యామిలీ గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అభయ్ భార్య పేరు భవాని. వీరికి 2019లో పెళ్లి జరిగింది. ఈ దంపతులకు అయంతిక అనే ఓ ముద్దుల కూతురు కూడా ఉంది. కాగా అభయ్, భవానీలది ప్రేమ వివాహం. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భవానీ అభయ్ తో తన లవ్ స్టోరీ గురించి ఇలా చెప్పుకొచ్చింది. ‘ నేను సాఫ్ట్ వేర్ జాబ్ చేసేటప్పుడు నాకు సంబంధాలు చూస్తుంటే అభయ్ ఫొటోలు వచ్చాయి. అతను కూడా జాబ్ చేస్తున్నాడు అని చెప్పారు. కానీ ఎందుకో ఆ ఫొటోలు పక్కన పెట్టి మా వాళ్లు నాకు వేరే సంబంధాలు చూసారు. ఆ తర్వాత మా అన్న ఒకసారి అభయ్ ఫొటోలు చూసి ఇతను జాబ్ కాదు యాక్టర్ అని చెప్పడంతో మా వాళ్లు వద్దనుకున్నారు’.
అభయ్ నవీన్ భార్య, కూతురు..
‘అయితే ఇది కొంచెం డిఫరెంట్ సంబంధం అనిపించి నేనే అభయ్ కి ఇన్‌స్టాగ్రామ్ లో మెసేజ్ చేశాను. నాకు ఫొటోలు పంపించిన ఆల్మోస్ట్ ఒక సంవత్సరం తర్వాత మెసేజ్ చేశాను. అప్పుడు నా ఫొటోలు ఏం చేసుకున్నారు మీ ఫ్యామిలీ అని తిట్టాడు. అలా మా పరిచయం మొదలైంది. ఆ తర్వాత మెల్లిగా మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్ లోనే మాట్లాడుకునే వాళ్లం. మా ప్రేమ విషయం ఇంట్లో చెప్తే అతను యాక్టర్ అని వద్దన్నారు. కానీ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం’ అని చెప్పుకొచ్చింది భవానీ.
అభయ్ భార్య, కూతురు.. వీడియో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.