Bigg Boss 8 Telugu: ఎవరిని ఎలా ఎమోషనల్‏గా వాడుకోవాలో నీకు బాగా తెలుసు.. సోనియా వర్సెస్ యష్మీ.. నామినేట్ అయ్యింది వీరే..

ముందుగా పృథ్వీని నామినేట్ చేస్తూ ఎగ్స్ టాస్కులో కావాల్సిన దానికన్నా అగ్రెషన్ ఎక్కువగా అగ్రెషన్ చూపించాడని..పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తించాడని చెప్పి నామినేట్ చేశాడు ఆదిత్య. ఆ తర్వాత సోనియాను నామినేట్ చేస్తూ.. హౌస్ లో మొదట 3 రోజులు ఉన్న సోనియా కనిపించలేదు.. తప్పు జరిగితే మాట్లాడటం న్యూట్రల్ గా ఉండడం నాకు కనిపించట్లేదు.. మైక్ తీసివేసి మాట్లాడుతున్నారు అంటూ రీజన్ చెప్పగా

Bigg Boss 8 Telugu: ఎవరిని ఎలా ఎమోషనల్‏గా వాడుకోవాలో నీకు బాగా తెలుసు.. సోనియా వర్సెస్ యష్మీ.. నామినేట్ అయ్యింది వీరే..
Bigg Boss 8 Telugu
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 24, 2024 | 7:01 AM

బిగ్‏బాస్ నాలుగోవారం నామినేషన్స్ మరింత రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా నబీల్ వర్సెస్ సోనియా, యష్మీ వర్సెస్ సోనియా మధ్య ఓ రేంజ్ డైలాగ్ డిస్కషన్ నడిచింది. పృథ్వీ, నిఖిల్‏తో సోనియా ఫ్రెండ్షిప్ పై యష్మీ కౌంటర్స్ ఇచ్చింది. నిన్నటి ఎపిసోడ్ లో మొదటగా ఆదిత్య ఓంతో నామినేషన్స్ స్టార్ట్ చేశాడు బిగ్‏బాస్. ముందుగా పృథ్వీని నామినేట్ చేస్తూ ఎగ్స్ టాస్కులో కావాల్సిన దానికన్నా అగ్రెషన్ ఎక్కువగా అగ్రెషన్ చూపించాడని..పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తించాడని చెప్పి నామినేట్ చేశాడు ఆదిత్య. ఆ తర్వాత సోనియాను నామినేట్ చేస్తూ.. హౌస్ లో మొదట 3 రోజులు ఉన్న సోనియా కనిపించలేదు.. తప్పు జరిగితే మాట్లాడటం న్యూట్రల్ గా ఉండడం నాకు కనిపించట్లేదు.. మైక్ తీసివేసి మాట్లాడుతున్నారు అంటూ రీజన్ చెప్పగా.. తన వెర్షన్ వాదించింది సోనియా. మీ ఏజ్ కు మీకు అర్థమైతే వినండి.. ఇక పృథ్వీ కోపమే నా బలం అంటూ రూడ్ గా మాట్లాడింది. ఇక తర్వాత నువ్వు సెల్ఫిష్.. పక్కవారిని కూడా డీమోటివేట్ చేస్తావ్.. నా దగ్గరకు వచ్చి డబుల్ ఎలిమినేషన్ ఉంటే నీతోపాటు నేను కూడా అంటూ అన్నావు.. అది నచ్చలేదంటూ మణికంఠను నామినేట్ చేసింది నైనిక. దీంతో ఏదేదో మాట్లాడి కవర్ చేసుకున్నాడు మణి.

ఆ తర్వాత ఆదిత్య ఓంను నామినేట్ చేసింది నైనిక. ఆ తర్వాత మణికంఠను నామినేట్ చేసింది ప్రేరణ. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నాకు అర్థం కావడం లేదు.. రీసెంట్ గా అయిన దోస టాస్కులో నీ ఇంటెన్షన్ నాకు తెలుసు అన్నావ్.. నాగ్ సర్ దగ్గర ఇంటెన్షన్ నాకు డౌట్ అన్నావ్ అంటూ నామినేట్ చేసింది. ఇక రెండో నామినేషన్ నైనికను చేస్తూ.. సైలెంట్ అయ్యావ్.. కొన్ని టాపిక్స్ లో ఇమ్మెచ్యూర్ గా ఉన్నావ్, నీ గేమ్ కనిపించలేదు అని ప్రేరణ చెప్పగా..అయితే గొడవలు పడాలా అంటూ రివర్స్ కౌంటరిచ్చింది. విష్ణుప్రియను ఒకమాట అంటే చెంప పగలగొట్టాల్సింది అని సలహా ఇచ్చావు.. అది నాకు ఇమ్మెచ్యూర్ గా అనిపించింది అంటూ ప్రేరణ చెప్పడంతో ఆ మాట నన్ను అంటే వెంటే చెంప పగలగొట్టేదాన్ని అంటూ గట్టిగానే ఆన్సర్ ఇచ్చింది.

సోనియాకు ఇచ్చిపడేసిన యష్మీ.. ఇక ఆ తర్వాత సోనియాను నామినేట్ చేస్తూ పాయింట్ టూ పాయింట్ మాట్లాడింది యష్మీ. ‘నేను తప్పు చేస్తే నువ్వు మాట్లాడతావని నా క్లాన్ లోకి తీసుకున్నాను.. కానీ నువ్వు ఏం చేయలేదు.. అలాగే ఇప్పుడు ఎగ్ టాస్కులో నిఖిల్, పృథ్వీ అగ్రెషన్ నీ బలం అని.. ఆ బలాన్ని నువ్వు వాడుకున్నావ్ కానీ ఆడటానికి ముందు రాలేదు.. ఇద్దరి సెపరేట్ లేకుండా నువ్వు ఆడి ఉంటే బాగుండేది’ అని చెప్పింది. దీంతో సోనియా మాట్లాడుతూ.. ‘వాళ్లిద్దరి అగ్రెషన్ కంటే నాకే ఎక్కువ.. నా కోపం వల్ల ఎవరిని హర్ట్ చేయకూడదని అనుకున్నాను.. ఎవరిని కొడతానో నాకే తెల్వదు ‘ అని చెప్పడంతో మరోసారి యష్మీ కౌంటరిచ్చింది. ఎగ్ టాస్కులో చీఫ్ మాట బ్రేక్ చేశావ్.. ఇంకా మీ క్లాన్ సభ్యులను రెచ్చగొట్టావ్.. వేరేవాళ్లను యూజ్ చేసుకుంటావ్ అంటూ యష్మీ గట్టిగానే ఇచ్చిపడేసింది. ఫిజికల్ టాస్కులో నీ గేమ్ కనిపించలేదని యష్మీ అనడంతో నిఖిల్, పృథ్వీలను చూస్తావు.. నన్ను చూడు అంటూ సోనియా మరింత రెచ్చిగొట్టింది. నేను నిఖిల్ నే చూస్తాను.. గేమ్ ఆడతాను.. కానీ నీకు ఎవరిని ఎలా వాడుకోవాలో ఎమోషనల్ గా తెలుసు అంటూ మరోసారి కౌంటరిచ్చింది. ఆ తర్వాత మణికంఠను నామినేట్ చేసింది యష్మీ. ఈ వారం హౌస్ లో పృథ్వీ, అదిత్య, సోనియా, నైనిక, మణికంఠ, నబీల్, ప్రేరణ నామినేట్ అయ్యారు. ఇక నిఖిల్ చీఫ్ కారణంగా ఒకరిని సేవ్ చేయాలని చెప్పడంతో నైనికను సేవ్ చేశాడు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.