Tollywood: ఈ అమ్మాయి సోషల్ మీడియా సెన్సెషన్.. 46 ఏళ్ల వయసులోనూ షాకిస్తోన్న ఫిట్నెస్..
ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుకు. అలాగే స్కూల్ యూత్ ఫెస్టివల్స్ వేదికలలోనూ స్టార్. తాజాగా ఈ అమ్మడు కాలేజీ రోజుల ఫోటో ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. ప్రస్తుతం మలయాళం, తమిళం భాషలలో వరుస సినిమాలతో మరోసారి అగ్రకథానాయికగా దూసుకుపోతుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా.. ?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ సెన్సెషన్ అవుతుంది. కొన్నాళ్ల క్రితం ఇండస్ట్రీలో చక్రం తిప్పిన ఈ అమ్మడు.. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండిపోయింది. కానీ దాదాపు 18 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె వయసు 46 ఏళ్లు. అయినప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీగా ఫిట్నెస్ తో షాకిస్తుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుకు. అలాగే స్కూల్ యూత్ ఫెస్టివల్స్ వేదికలలోనూ స్టార్. తాజాగా ఈ అమ్మడు కాలేజీ రోజుల ఫోటో ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. ప్రస్తుతం మలయాళం, తమిళం భాషలలో వరుస సినిమాలతో మరోసారి అగ్రకథానాయికగా దూసుకుపోతుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ మంజు వారియర్.
ప్రస్తుతం మంజుకు సంబంధించిన స్కూల్ డేస్ ఫోటో నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. సెంట్రల్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నేషనల్ టాలెంట్ సెర్చ్ అండ్ ట్రైనింగ్ స్కాలర్‌షిప్ (భరత్ నాట్యం) పొందినప్పుడు వార్తాపత్రికలలో వచ్చిన రిపోర్ట్‌ను మంజు తన ఇన్ స్టాలో షేర్ చేసుకుంది. తొమ్మిదో తరగతి నుంచి మలయాళంలో ఏకకై సూపర్ స్టార్ గా ఎదిగింది మంజు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంజు.. మొదట్లో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్. ఆ తర్వాత నటన ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మదిలో ‘లేడీ సూపర్ స్టార్’ స్థానాన్ని సంపాదించుకుంది. వరుసగా రెండేళ్లు రాష్ట్ర స్కూల్ యూత్ ఫెస్టివల్‌లో కళాతిలక బిరుదు పొందిన మంజు వారియర్ 1995లో ‘సాక్ష్యం’ సినిమాతో తొలిసారిగా నటించింది. ఆ తర్వాత ‘సల్లపం’ సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది.
19 ఏళ్లకే కథానాయికగా నేషనల్ అవార్డ్ అందుకున్న మంజు.. 20 ఏళ్ల వయసులోనే తోటి నటుడు దిలీప్ కుమార్ ను వివాహం చేసుకుంది. వీరికి ఓ పాప కూడా జన్మించింది. కానీ దిలీప్ మరో హీరోయిన్ కావ్యను ప్రేమించడంతో మంజు అతడి నుంచి విడాకులు తీసుకుంది. దాదాపు 18 ఏళ్లు నటనకు దూరంగా మంజు.. విడాకుల తర్వాత తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. అజిత్, ధనుష్ వంటి స్టార్ హీరోలతో నటించిన మంజు ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న వెట్టాయన్ చిత్రంలో నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్ ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. అందులో మంజు లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ ఛాయిస్ గా మారింది మంజు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.