Laapataa Ladies: ఆస్కార్ బరిలో నిలిచిన ‘లాపతా లేడీస్’.. బడ్జెట్ తెలిస్తే షాకవ్వాల్సిందే..

ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా ఆస్కార్ బరిలో నిలిచింది. ఈ సినిమా 2025 ఆస్కార్ పురస్కారాలకు మన దేశం నుంచి అధికారికంగా ఎంపికైంది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ భార్య, దర్శక నిర్మాత కిరణ్ రావు తెరకెక్కించిన ఈ మూవీ ఈ ఏడాది మార్చి 1న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్ ప్రధాన పాత్రలు పోషించగా.. అమీర్ ఖాన్ ఈ సినిమాను నిర్మించారు.

Laapataa Ladies: ఆస్కార్ బరిలో నిలిచిన 'లాపతా లేడీస్'.. బడ్జెట్ తెలిస్తే షాకవ్వాల్సిందే..
Lapata Ladies
Follow us

|

Updated on: Sep 24, 2024 | 8:32 AM

ఇప్పుడు ఎక్కడ చూసిన ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘లాపతా లేడీస్’. ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చిన చిన్న సినిమా. స్టార్ హీరోహీరోయిన్స్ లేకుండా నవతరం యువ నటీనటులతో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇన్నాళ్లు సూపర్ హిట్ టాక్ తో అడియన్స్ హృదయాలను గెలుచుకున్న ఈ మూవీ.. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా ఆస్కార్ బరిలో నిలిచింది. ఈ సినిమా 2025 ఆస్కార్ పురస్కారాలకు మన దేశం నుంచి అధికారికంగా ఎంపికైంది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ భార్య, దర్శక నిర్మాత కిరణ్ రావు తెరకెక్కించిన ఈ మూవీ ఈ ఏడాది మార్చి 1న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్ ప్రధాన పాత్రలు పోషించగా.. అమీర్ ఖాన్ ఈ సినిమాను నిర్మించారు.

ఇప్పటికే పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ సినిమా. సుప్రీం కోర్టు 75 ఏళ్ల వేడుకల్లోనూ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించడం మరో విశేషం. 2025 ఆస్కార్ కు మన దేశం నుంచి ఈ చిత్రాన్ని ఎంపిక చేసినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఇందులో పలు భారతీయ భాషలకు చెందిన 29న చిత్రాల్లో నుంచి లాపతా లేడీస్ సినిమాను ఎంపిక చేశారు. ఇక నిన్నటి నుంచి ఈ సినిమా పేరు మరోసారి సోషల్ మీడియాలో మారుమోగుతుంది. ప్రస్తుతం లాపతా డేడీస్ ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మరోవైపు ఈ మూవీ ఆస్కార్ బరిలో నిలవడంతో అడియన్స్ సంతోషం వ్యక్తం చేస్తుండగా..ఇప్పటికీ ఈ సినిమా చూడనివారు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వెతికేస్తున్నారు. అయితే ఆస్కార్ బరిలో నిలిచిన ఈ సినిమా బడ్జెట్ తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్. ఈ సినిమాను కేవలం రూ.4 నుంచి 5 కోట్లతో రూపొందించారు. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రూ.27 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

రణబీర్ కపూర్, రష్మిక మందన్నా కలిసి నటించిన యానిమల్ సినిమాతోపాటు కార్తీక్ ఆర్యన్ నటించిన చందు ఛాంపియన్, ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి వంటి అధిక బడ్జెట్ చిత్రాలతో ఈ మూవీ పోటిపడింది. విపరీతమైన బడ్జెట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కంటే కేవలం మంచి కథ.. సరళమైన, ఆకర్షణీయమైన డైరెక్షన్, సహజ నటనతో అడియన్స్ హృదయాలను దోచేసింది ఈ మూవీ. ఇప్పటికే ఈ సినిమా 8వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)లో ప్రదర్శించారు. ఇక ఇప్పుడు ఆస్కార్ బరిలో మన దేశం నుంచి నిలబడింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.