Tollywood: పంజా మూవీ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా.? పిచ్చెక్కించేంత హాట్‌గా

రిజల్ట్‌తో పన్లేకుండా పవన్ కళ్యాణ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతాయన్న సంగతి తెలిసిందే. దీన్ని బట్టే పవన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ఇట్టే చెప్పేయొచ్చు. ఇక పవన్ కెరీర్‌లోని వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్‌లో 'పంజా' ఒకటి.

Tollywood: పంజా మూవీ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా.? పిచ్చెక్కించేంత హాట్‌గా
Panja Heroine
Follow us

|

Updated on: Sep 30, 2024 | 1:35 PM

రిజల్ట్‌తో పన్లేకుండా పవన్ కళ్యాణ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతాయన్న సంగతి తెలిసిందే. దీన్ని బట్టే పవన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ఇట్టే చెప్పేయొచ్చు. ఇక పవన్ కెరీర్‌లోని వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్‌లో ‘పంజా’ ఒకటి. దర్శకుడు విష్ణువర్ధన్ తెరకెక్కించిన ఈ చిత్రం 2011లో విడుదలైంది. ఇందులోని పవన్ గ్యాంగ్‌స్టర్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో సారా జేన్ డియాస్, అంజలి లావానియా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో కట్టుబొట్టులో పక్కింటి అమ్మాయిలా కనిపించిన సారా.. దీని తర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు ఏవి చేయలేదు. మరి ఆమె ఇప్పుడెలా ఉంది.? ఏం చేస్తోందో.? చూసేద్దాం.

ఒమన్ దేశానికి చెందిన ఈ బ్యూటీ.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందు టీవీ హోస్ట్‌గా, వీడియో జాకీగా పని చేసింది. ఆ తర్వాత మోడలింగ్ ద్వారా తన సినీ కెరీర్ ప్రారంభించింది. 2010లో ‘తీరదా విలై‌యట్టు పిళ్ళై’ అనే తమిళ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమాతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాకపోగా.. తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన నటించిన ‘పంజా’ చిత్రం ఈ అమ్మడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కానీ ఈ చిత్రంతో ఈమె తెలుగులో మరిన్ని అవకాశాలు రాలేదు. హిందీకి షిఫ్ట్ అయిన ఈ భామ.. అక్కడ నాలుగైదు చిత్రాల్లో నటించింది. చివరిగా 2017లో వైస్రాయ్ హౌస్ అనే ఇంగ్లీష్ చిత్రంలో కనిపించింది సారా. అటు ఇటీవల ‘మేడ్ ఇన్ హెవెన్’, ‘ది ఫ్రీలాన్సర్’ అనే వెబ్ సిరీస్‌లలోనూ కీలక పాత్రలు పోషించింది ఈ భామ.

ఇవి కూడా చదవండి

సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది సారా జేన్ డియాస్. నిత్యం హాట్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లు కునుకు తీయకుండా చేస్తోంది. పంజా సినిమా టైంలో బొద్దుగా కనిపించిన ఈ వయ్యారి.. ఇప్పటి లుక్ చూసి ఫ్యాన్స్ తెగ షాక్ అవుతున్నారు. లేట్ ఎందుకు ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

ఇది చదవండి: కమెడియన్ లక్ష్మీపతి కొడుకు ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరో.. ఎవరో తెల్సా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి