AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna: ‘రాజకీయాలకు వాడుకోకండి’.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన నాగార్జున

టాలీవుడ్ హీరోయిన్లు, ముఖ్యంగా నాగచైతన్య- సమంత విడాకులకు సంబంధించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీనిపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇప్పటికే ప్రకాశ్ రాజ్ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా అక్కినేని నాగార్జన మంత్రి వ్యాఖ్యలపై స్పందించారు

Nagarjuna: 'రాజకీయాలకు వాడుకోకండి'.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన నాగార్జున
Nagarjuna, Konda Surekha
Basha Shek
|

Updated on: Oct 02, 2024 | 5:54 PM

Share

టాలీవుడ్ హీరోయిన్లు, ముఖ్యంగా నాగచైతన్య- సమంత విడాకులకు సంబంధించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీనిపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇప్పటికే ప్రకాశ్ రాజ్ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా అక్కినేని నాగార్జన మంత్రి వ్యాఖ్యలపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ‘గౌరవనీయ మంత్రివర్యులు కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను’ అని కోరారు నాగార్జున.

నాగార్జున ట్వీట్..

అంతకు ముందు ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు.  సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన ‘ ఏంటీ ఈ సిగ్గులేని రాజకీయాలు.. సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే ఇంత చిన్న చూపా?.. జస్ట్‌ ఆస్కింగ్‌’ అంటూ కామెంట్స్‌ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ.. సినీ నటుల గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు.

ప్రకాశ్ రాజ్ ట్వీట్..

మొత్తానికి మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతున్నాయి. కేటీఆర్ ను విమర్శించే క్రమంలో ఏ మాత్రం సంబంధం లేని  సినిమా ఇండస్డ్రీని లాగడంపై భిన్నాభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?