Mathu Vadalara 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘మత్తు వదలరా 2’.. స్ట్రీమింగ్ అప్పుడేనా.. ?

అంతేకాకుండా ఈ మూవీ ట్రైలర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేయడం.. ప్రమోషన్లలో రాజమౌళి సందడి చేయడంతో రిలీజ్ కు ముందే ఈ చిత్రంపై క్యూరియాసిటి నెలకొంది. తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అలాగే నిర్మాతల అంచనాలకు తగ్గట్లుగా వసూళ్లు రాబట్టింది.

Mathu Vadalara 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'మత్తు వదలరా 2'.. స్ట్రీమింగ్ అప్పుడేనా.. ?
Mathu Vadalara 2
Follow us

|

Updated on: Oct 02, 2024 | 5:16 PM

ఇటీవల తెలుగు సినీరంగంలో విడుదలైన సూపర్ హిట్ చిత్రాల్లో ‘మత్తు వదలరా 2’ ఒకటి. సెప్టెంబర్ 13న రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద సకెస్స్ సాధించింది. ఈ క్రైమ్ కామెడీ మూవీలో నటుడు శ్రీసింహా, సత్య ప్రధాన పాత్రలలో నటించారు. గతంలో దాదాపు ఐదేళ్ల క్రితం వచ్చిన మత్తు వదలరా సినిమాకు సీక్వెల్ ఇది. విడుదలకు ముందే ఈ మూవీ పై మంచి బజ్ నెలకొంది. అంతేకాకుండా ఈ మూవీ ట్రైలర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేయడం.. ప్రమోషన్లలో రాజమౌళి సందడి చేయడంతో రిలీజ్ కు ముందే ఈ చిత్రంపై క్యూరియాసిటి నెలకొంది. తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అలాగే నిర్మాతల అంచనాలకు తగ్గట్లుగా వసూళ్లు రాబట్టింది.

ఇక ఇన్నాళ్లు థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యింది. అడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ క్రైమ్ కామెడీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 11 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వస్తుంది. అలాగే దసరా పండగ సందర్భంగా వస్తుండడంతో ఈ చిత్రానికి ఓటీటీలోనూ అత్యధిక వ్యూస్ రానున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ రితేశ్ రాణా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్య, శ్రీసింహా యాక్టింగ్ పై ప్రశంసలు దక్కాయి. కామెడీ టైమింగ్ తో ఇద్దరూ అదరగొట్టారు. ఇక ఇందులో ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిశోర్, సునీల్, రోహిణ్, అజయ్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం దాదాపు రూ.32 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

View this post on Instagram

A post shared by TJ💀 (@teja_r7)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దళితుల ఇంట్లో వంట చేసిన రాహుల్ గాంధీ..!
దళితుల ఇంట్లో వంట చేసిన రాహుల్ గాంధీ..!
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!
గ్యాస్‌ వినియోగదారులకు మరోసారి షాక్‌.! ధర పెంచుతూ ప్రకటన..
గ్యాస్‌ వినియోగదారులకు మరోసారి షాక్‌.! ధర పెంచుతూ ప్రకటన..
యూట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.! అరెస్ట్‌.?
యూట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.! అరెస్ట్‌.?
హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!
హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!
ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..
ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..
ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!
ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!
అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌ న్యూస్‌.! 2.5 లక్షల వీసాలు.
అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌ న్యూస్‌.! 2.5 లక్షల వీసాలు.
అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.!
అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.!
నీలి చిత్రాల్లో నటించే భామ రెజ్యూమ్.. అయినా 29 ఇంటర్వ్యూ కాల్స్‌.
నీలి చిత్రాల్లో నటించే భామ రెజ్యూమ్.. అయినా 29 ఇంటర్వ్యూ కాల్స్‌.