AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా.. పిల్లలు, పేరెంట్స్ తప్పకుండా చూడాల్సిన మూవీ 

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 35..  చిన్న కథ కాదు. మాస్, యాక్షన్ సినిమాలకు భిన్నంగా ఓ వినూత్నమైన కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కింది. యూనివర్సల్ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా కథ నచ్చడంతో టాలీవుడ్ ప్రముఖ హీరో దగ్గుబాటి రానా ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా.. పిల్లలు, పేరెంట్స్ తప్పకుండా చూడాల్సిన మూవీ 
35 Cinna Katha Kaadu Movie
Basha Shek
|

Updated on: Oct 02, 2024 | 12:45 PM

Share

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 35..  చిన్న కథ కాదు. మాస్, యాక్షన్ సినిమాలకు భిన్నంగా ఓ వినూత్నమైన కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కింది. యూనివర్సల్ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా కథ నచ్చడంతో టాలీవుడ్ ప్రముఖ హీరో దగ్గుబాటి రానా ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. నంద కిశోర్ తెరకెకకించిన 35 – చిన్న కథ కాదు చిత్రంలో విశ్వదేవ్ రాచకొండ, ప్రియదర్శి, అరుణ్ దేవ్, గౌతమి, అభయ్ శంకర్, భాగ్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 6 న థియేటర్లలో విడుదలైన ఈ ఫీల్ గుడ్ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చదువు విషయంలో తల్లిదండ్రులు పిల్లలకు సపోర్ట్ చేయడం ఎంత ముఖ్యమనే విషయాన్ని ఈ మూవీలో చాలా చక్కగా చూపించడంతో అందరూ ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. థియేటర్లలో ఆడియెన్స్ మెప్పు పొందిన ఈ ఫీల్ గుడ్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. 35- ఒక చిన్న కథ కాదు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో గాంధీ జయంతి స్పెషల్ గా బుధవారం (అక్టోబర్ 02) అర్ధరాత్రి నుంచే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

35- ఒక చిన్న కథ కాదు సినిమను సృజన్, సిద్ధార్థ్ రాళ్లపల్లి ప్రొడ్యూజ్ చేశారు. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై రానా సమర్పించారు. వివేక్ సాగర్ స్వరాలు సమకూర్చారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. సినిమా కథ విషయానికి వస్తే.. ఇది తిరుపతి నేపథ్యంలో సాగే ఒక ఫీల్ గుడ్ మూవీ. మ్యాథ్స్ సబ్జెక్టులో వెనుకపడిన విద్యార్థిని టీచర్ జీరో అని పిలుస్తుంటాడు. స్కూల్‍లో ఉండాలంటే ఆ సబ్జెక్టులో ఆ స్టూడెంట్ తప్పక 35 మార్కులు తెచ్చుకోవాలని కండీషన్ పెడతాడు. దీంతో కొడుకు కోసం తల్లి (నివేదా థామస్) మ్యాథ్స్ నేర్చుకుంటుంది. ఆ తర్వాత కొడుక్కి మ్యాథ్స్ నేర్పిస్తుంది. మరి ఉపాధ్యాయుడు చెప్పినట్లు పిల్లాడు మ్యాథ్స్ లో పాస్ మార్కులు తెచ్చుకున్నాడా? అనేది మెయిన్ పాయింట్. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్..

35..  చిన్న కథ కాదు సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us