AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Goat Movie: ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ దళపతి సూపర్ హిట్ మూవీ.. ‘ది గోట్’ ఎక్కడ చూడొచ్చంటే..

ఈ యాక్షన్ డ్రామాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా.. శివకార్తికేయన్, త్రిష అదితి పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఫస్ట్ డే ఓపెనింగ్ అదిరిపోయినప్పటికీ ఆ తర్వాత మాత్రం డ్రాప్ అయ్యింది.

The Goat Movie: ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ దళపతి సూపర్ హిట్ మూవీ.. 'ది గోట్' ఎక్కడ చూడొచ్చంటే..
The Goat
Rajitha Chanti
|

Updated on: Oct 03, 2024 | 3:42 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటేస్ట్ సూపర్ హిట్ ఫిల్మ్ ది గోట్. డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ యాక్షన్ డ్రామాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా.. శివకార్తికేయన్, త్రిష అదితి పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఫస్ట్ డే ఓపెనింగ్ అదిరిపోయినప్పటికీ ఆ తర్వాత మాత్రం డ్రాప్ అయ్యింది. ది గోట్ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. కొంతకాలంగా స్ట్రీమింగ్ డేట్ పై ఫుల్ బజ్ నడుస్తుండగా..ఇప్పుడు ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది.

ఈ సినిమా గత అర్దరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో ఈ చిత్రం అందుబాటులోకి వచ్చేసింది. థియేటర్లలో మొత్తం ఐదు భాషలలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి కూడా అన్ని భాషలలో ఒకసారి వచ్చేసింది. థియేటర్లతో పోలిస్తే నెట్ ఫ్లిక్స్ ఓటీటీ రన్ టైమ్ తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ దళపతి డ్యూయల్ రోల్ చేశారు. యంగ్ క్యారెక్టర్ కోసం డీఏజింగ్ టెక్నాలజీని డైరెక్టర్ వెంకట్ వినియోగించారు. అయితే దీనిపై మిక్డ్ టాక్ వచ్చింది. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవ, మోహన్, జయరాం, అజ్మల్ అమీర్, వైభవ్, యోగిబాబు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రంలో హీరోయిన్ త్రిష స్పెషల్ సాంగ్ చేసింది.

ఇవి కూడా చదవండి

ది గోట్ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యాయనర్ పై నిర్మించగా.. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. భారీ హైప్ మధ్య అడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లు రాబట్టగా.. రూ125 కోట్లతో నెట్ ఫ్లిక్స్ డీల్ చేసుకున్నట్లు సమాచారం. ఎట్టకేలకు ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్