Nagarjuna : నాగార్జున అందం కోసమే తీసిన సినిమా అది.. కట్ చేస్తే.. ఇప్పటికీ కల్ట్ క్లాసిక్..
అక్కినేని నాగార్జున సినిమాల క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. 66 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇన్నాళ్లు హీరోగా మెప్పించిన ఆయన.. ఇప్పుడు కథ నచ్చితే విలన్ రోల్స్ చేయడానికి సైతం సిద్ధమవుతున్నారు. ఇటీవలే కూలీ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించి అదరగొట్టారు.

ప్రముఖ దర్శకుడు విజయ భాస్కర్ ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, తాను దర్శకత్వం వహించిన పలువురు స్టార్ హీరోల వ్యక్తిత్వాలు, వారి నటన గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా, బ్లాక్‌బస్టర్ చిత్రం మన్మథుడులో అక్కినేని నాగార్జున శైలి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. మన్మథుడు చిత్రంలో నాగార్జున గారి లుక్, కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్ అన్నీ కలిసి ఆయన కెరీర్‌లోనే అత్యుత్తమంగా కనిపించాయని విజయ భాస్కర్ అన్నారు. నాగార్జునలో ఒక సహజమైన స్టైల్ ఉందని, దాన్ని దృష్టిలో ఉంచుకునే తాము స్క్రిప్టింగ్ చేశామని, అది ఆయనకు సరిపోయే విధంగా ఉండాలని కోరుకున్నామని భాస్కర్ వివరించారు. ఆయన నడిచే తీరు, మాట్లాడే విధానం, ఎవరినైనా మందలించినా, లేదా ఏదైనా చేసినా అందులో ఒక సున్నితత్వం, సొఫిస్టికేషన్ కనిపిస్తాయని పేర్కొన్నారు.
ఎక్కువమంది చదివినవి : Folk Singer : 4 లక్షలతో తీస్తే యూట్యూబ్‌నే షేక్ చేసిన ఫోక్ సాంగ్.. రివెన్యూ ఎంత వచ్చిందంటే..
అదేవిధంగా, దగ్గుబాటి వెంకటేష్ గురించి మాట్లాడుతూ, ఆయన బయట ఎంత హ్యాండ్సమ్ గా ఉంటారో, ఆయన ఫిజిక్, పర్సనాలిటీ కూడా అంతే ఆకట్టుకుంటాయని అన్నారు. వెంకటేష్ చాలా “రియల్” అని, స్టైలిష్‌గా కనిపించడానికి లేదా ఒక ఇమేజ్‌ను ప్రదర్శించడానికి ప్రయత్నించరని, అందుకే ప్రేక్షకులు ఆయన్ను ఎంతగానో ప్రేమిస్తారని భాస్కర్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి చార్మ్ గురించి ప్రస్తావిస్తూ, ఆయన ఏ రూమ్‌లోకి వచ్చినా తన సహజమైన ఆకర్షణతో ఆ వాతావరణాన్ని డామినేట్ చేస్తారని, ఆయనలో తెలియని ఒక అరిస్టోక్రసీ ఉంటుందని తెలిపారు. చిరంజీవి మంచి కామెడీ టైమింగ్ కలిగి ఉన్నారని, ఆయన మాస్ సినిమాలకు ఎంతగా సరిపోతారో, క్లాస్ సినిమాలకు కూడా అంతే బాగా సరిపోతారని చాలా మంది అడిగారని, ఈ రెండింటిని బ్లెండ్ చేయడానికి తాను ప్రయత్నించానని అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Ravi Teja : రవితేజ తింటుంటే ఆ ప్రొడ్యుసర్ దారుణంగా అవమానించాడు.. ఎలా దెబ్బకొట్టాడంటే..
తరుణ్ చిన్న వయస్సులో చాలా బబ్లీగా, ఎనర్జిటిక్‌గా ఉండేవారని, పాటల్లో ఆయన డాన్స్ చాలా లవ్లీగా, “బాయ్ నెక్స్ట్ డోర్” ఇమేజ్‌తో ఉండేవారని గుర్తు చేసుకున్నారు. వేణు మంచి స్టైలైజ్డ్ సూట్స్‌తో పాటల్లో కనిపించేవారని తెలిపారు. ప్రతి నటుడిలోని ఉత్తమ లక్షణాలను బయటకు తీసుకురావడమే తన పని అని, వారిలో సహజంగా ఉన్నదాన్ని గుర్తించి దాన్ని తెరపై చూపించడానికి ప్రయత్నిస్తానని భాస్కర్ అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Song Flashback: రాలిపోయే పువ్వా పాటకు నేషనల్ అవార్డ్.. కానీ వెనక్కు ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే..
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆశాపాశం సాంగ్ రాసింది నేనే.. కానీ అతడు సాంగ్ నా కెరీర్ మలుపు తిప్పింది.. లిరిసిస్ట్..
