Venu Swamy: వేణు స్వామి ఇంట తీవ్ర విషాదం.. ఇంటి పెద్ద దిక్కు కన్నుమూయడంతో..

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీల జాతకాలు చెబుతూ బాగానే గుర్తింపు తెచ్చుకున్నారీ ఆస్ట్రాలజర్.

Venu Swamy: వేణు స్వామి ఇంట తీవ్ర విషాదం.. ఇంటి పెద్ద దిక్కు కన్నుమూయడంతో..
Venu Swamy
Follow us
Basha Shek

|

Updated on: Oct 04, 2024 | 5:14 PM

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీల జాతకాలు చెబుతూ బాగానే గుర్తింపు తెచ్చుకున్నారీ ఆస్ట్రాలజర్. అదే సమయంలో కొన్ని సున్నితమైన విషయాలను టచ్ చేసి ఇబ్బందుల్లో పడ్డారు. నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల వైవాహిక జీవితంపై వేణు స్వామి చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యవహారం పోలీసు కేసుల దాకా వెళ్లింది. వీటి సంగతి పక్కన పెడితే.. వేణు స్వామి వ్యక్తి గత జీవితంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వేణు స్వామి తల్లి పరాంకుశం విజయ లక్ష్మి శుక్రవారం (అక్టోబర్ 4) కన్నుమూశారు. ఈ విషయాన్ని స్వామీజీనే సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘మా అమ్మ గారు శ్రీమతి పరాంకుశం విజయ లక్ష్మి గారు ఈరోజు ఉదయం పరమపదించారు (మరణించారు)’ అంటూ సోషల్ మీడియాలో తన తల్లి ఫొటోను షేర్ చేశారు వేణు స్వామి. దీంతో పలువురు ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. వేణు స్వామి తల్లి ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్థిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే వేణు స్వామి భార్య వీణా శ్రీవాణి ఇటీవల తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేసిందామె.. ‘పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూ కోసం సామాజిక మాధ్యమాల వేదికగా ఎంతో మంది రచ్చ రచ్చ చేశారు. ప్రజలు, భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు. రాజకీయ నాయకుల సంగతి పక్కన బెడితే.. ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఓవర్ యాక్టింగ్ మామూలుగా చేయలేదు? వీళ్లు భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు. ఇప్పుడు వారంతా ఏం చేస్తారు. మీరు నిజమైన హిందువులైతే.. వెంకటేశ్వరస్వామి భక్తులైతే.. మమ్మల్ని క్షమించండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారా? పెట్టండి ఎంతమంది పెడతారో చూస్తాను’ అని చెప్పుకొచ్చింది వీణా శ్రీవాణి.

ఇవి కూడా చదవండి

ఇంటి పెద్ద కన్నుమూయడంతో..

Venu Swamy Mother

Venu Swamy Mother

మా అత్తమ్మ ఇక లేరు.. వేణు స్వామి భార్య ఎమోషనల్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి

కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న