AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajendra Prasad: రాజేంద్రప్రసాద్‏ను పరామర్శించిన, చిరంజీవి, అల్లు అర్జున్.. గాయత్రి పార్థివదేహానికి సినీ ప్రముఖుల నివాళులు..

కూతురు మృతితో రాజేంద్రప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇప్పటికే సినీ ప్రముఖులు, సన్నిహితులు రాజేంద్రప్రసాద్ ఇంటికి చేరుకుని ఆయనను పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, అల్లు అర్జున్, సాయి కుమార్, దర్శకుడు త్రివిక్రమ్ తదితరులు రాజేంద్రప్రసాద్ ను పరామర్శించారు.

Rajendra Prasad: రాజేంద్రప్రసాద్‏ను పరామర్శించిన, చిరంజీవి, అల్లు అర్జున్.. గాయత్రి పార్థివదేహానికి సినీ ప్రముఖుల నివాళులు..
Rajendraprasad, Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Oct 05, 2024 | 4:53 PM

Share

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి తుదిశ్వాస విడిచింది. 38 ఏళ్ల గాయత్రికి నిన్న ఛాతీలో నొప్పి రావడంతో ఆమెను వెంటనే హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గాయత్రి కన్నుమూసింది. కూతురు మృతితో రాజేంద్రప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇప్పటికే సినీ ప్రముఖులు, సన్నిహితులు రాజేంద్రప్రసాద్ ఇంటికి చేరుకుని ఆయనను పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, అల్లు అర్జున్, సాయి కుమార్, దర్శకుడు త్రివిక్రమ్ తదితరులు రాజేంద్రప్రసాద్ ను పరామర్శించారు.

కాసేపటి క్రితం అల్లు అర్జున్ రాజేంద్రప్రసాద్ నివాసాకి చేరుకున్న అల్లు అర్జున్.. గాయత్రి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం నటకిరిటీకి ధైర్యం చెప్పారు. ఇదిలా ఉంటే.. గతంలో జరిగిన ఓ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ తన కుమార్తె గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట మళ్లీ వైరల్ అవుతుంది. బేవార్స్ సినిమాలో కూతురి మీద ఓ పాట వస్తుందని.. కూతురు లేకపోతే తండ్రి ఎలా అయిపోయాడు.. అమ్మను తన కూతురిలో చూసుకునే తండ్రి ఎంతలా విలవిల్లాడిపోతాడు అనేది ఆ పాటలో ఉంటుందని అన్నాడు. ఆ పాటను సుద్ధాల అశోక్ తేజ అద్భుతంగా రాస్తే.. అది తన మనసులోంచి.. గుండెల్లోంచి వచ్చినట్లుగా అనిపించిందని చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన కూతురితో తాను మాట్లాడటం లేదని.. అయినా ఈ పాట విన్న తర్వాత ఆమెను పిలిపించి.. తన మనసులోని మాట ఈ పాటను ప్లే చేసి చూపించానని చూబుతూ తన కూతురిపై ఉన్న ప్రేమను పాట రూపంలో తెలియజేశాడట. చిన్నతనంలోనే తన తల్లి చనిపోతే.. కూతురిలోనే తల్లిని చూసుకున్నాడట రాజేంద్రప్రసాద్. ఇప్పుడు కూతురి మరణంతో రాజేంద్రప్రసాద్ తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్