Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ ఓటింగ్‌లో బిగ్ ట్విస్ట్.. ఈ సండే ఊహించని కంటెస్టెంట్ బయటకు.. షాక్‌లో ఫ్యాన్స్

ఈ వారంలో మిడ్ నైట్ ఎలిమినేషన్ లో భాగంగా ఆదిత్య ఓం కూడా బయటకు వచ్చేశారు. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎక్కువ మంది ఆదిత్య ఓం పేరు చెప్పడంతో అతను బయటకు వెళ్లక తప్పలేదు. ఇక ఆదివారం (అక్టోబర్ 06) మరొకరు ఎలిమినేట్ కానున్నారు. దీంతో ఎవరా ఆ ఒకరు అని ఆడియెన్స్ లో ఉత్కంఠ నెలకొంది

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ ఓటింగ్‌లో బిగ్ ట్విస్ట్.. ఈ సండే ఊహించని కంటెస్టెంట్ బయటకు.. షాక్‌లో ఫ్యాన్స్
Bigg Boss 8 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Oct 05, 2024 | 3:50 PM

బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్‌గా నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ప్రజెంట్ ఐదో వారం ఎండింగ్ కు కూడా వచ్చేసింది. సెప్టెంబర్ 01న మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టగా, వారానికి ఒక్కరు చొప్పున బయటకు వెళ్లిపోయారు. బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్, సోనియా ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారంలో మిడ్ నైట్ ఎలిమినేషన్ లో భాగంగా ఆదిత్య ఓం కూడా బయటకు వచ్చేశారు. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎక్కువ మంది ఆదిత్య ఓం పేరు చెప్పడంతో అతను బయటకు వెళ్లక తప్పలేదు. ఇక ఆదివారం (అక్టోబర్ 06) మరొకరు ఎలిమినేట్ కానున్నారు. దీంతో ఎవరా ఆ ఒకరు అని ఆడియెన్స్ లో ఉత్కంఠ నెలకొంది. కాగా ఐదో వారం నామినేషన్స్ లో మణికంఠ, విష్ణుప్రియ, నబీల్ అఫ్రీదీ, ఆదిత్య ఓం, నైనిక నిఖిల్.. ఇలా మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరితో ఆదిత్యం ఓం ఇప్పటికే హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇక ఓటింగ్ విషయానికి వస్తే.. గత వారం లాగే ఈ వారం కూడా నబీల్ అఫ్రిదీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఇవి కూడా చదవండి

రెండో స్థానంలో నిఖిల్ ఉండగా, మూడో స్థానంలో మణికంఠ, నాలుగో స్థానంలో విష్ణుప్రియ ఉన్నారు. ఇక ఆఖరి స్థానంలో ఢీ ఫేమ్ నైనిక ఉంది. అంటే ప్రస్తుతం నైనికనే డేంజర్ జోన్ లో ఉందన్నమాట. ఈ క్రమంలో సండే నాడు నైనికనే ఎలిమినేట్ అయ్యే బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రారంభంలో తన గేమ్ తో ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది నైనిక. ఆమె ఆట, మాట తీరు చూస్తుంటే టాప్-5 లో ఉంటుందని భావించారు చాలా మంది. ముఖ్యంగా హౌస్ కు చీఫ్ అవ్వడానికి నైనిక ఆడిన గేమ్ విధానం బిగ్ బాస్ లవర్స్‌ను ఆకట్టుకుంది. అయితే గత కొన్ని రోజులుగా నైనిక ఇన్ యాక్టివ్ గా మారిపోయింది. గేమ్ కూడా డల్ అయిపోయంది. ఈ కారణంగానే ఆమెకు తక్కువ ఓట్లు పడ్డాయని తెలుస్తోంది. మరి నైనికనే ఎలిమినేట్ అవుతుందో లేక బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చి మరోకరిని బలి చేస్తాడో చూడాలి.

నైనిక బయటకు వెళ్లక తప్పదా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!