AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu: ఏడవడం నీ స్ట్రాటజీ అయితే అది పనికిరాదు.. మణికంఠకు వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..

ఈ శనివారం ఎలిమినేషన్ ప్రక్రియ ముగించి.. ఆదివారం ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలను పంపించనున్నారు. గత సీజన్ లో ప్రవేశపెట్టినట్లుగానే రేపు బిగ్‌బాస్ 2.0 గ్రాండ్ గా లాంచ్ కాబోతుంది. దీంతో ఈసారి హౌస్ లోకి ఎవరెవరు వస్తున్నారనే క్యూరియాసిటి నెలకొంది. తాజాగా విడుదలైన ప్రోమోలో హౌస్మేట్స్ తో సరదాగా ముచ్చటించారు నాగ్.

Bigg Boss 8 Telugu: ఏడవడం నీ స్ట్రాటజీ అయితే అది పనికిరాదు.. మణికంఠకు వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..
Bigg Boss 8 Telugu
Rajitha Chanti
|

Updated on: Oct 05, 2024 | 3:22 PM

Share

బిగ్‌బాస్ ఐదో వారం వీకెండ్ ప్రోమో వచ్చేసింది. ఇప్పటికే మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరుతో ఆదిత్య ఓంను బయటకు పంపించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ ఆదివారం మరొకరిని కూడా ఎలిమినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈవారం హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండనున్నాయి. దాదాపు ఎనిమిది మందిని హౌస్ లోకి పంపించబోతున్నారు. ఈ శనివారం ఎలిమినేషన్ ప్రక్రియ ముగించి.. ఆదివారం ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలను పంపించనున్నారు. గత సీజన్ లో ప్రవేశపెట్టినట్లుగానే రేపు బిగ్‌బాస్ 2.0 గ్రాండ్ గా లాంచ్ కాబోతుంది. దీంతో ఈసారి హౌస్ లోకి ఎవరెవరు వస్తున్నారనే క్యూరియాసిటి నెలకొంది. తాజాగా విడుదలైన ప్రోమోలో హౌస్మేట్స్ తో సరదాగా ముచ్చటించారు నాగ్. అలాగే మణికంఠకు స్మూత్ వార్నింగ్ కూడా ఇచ్చారు.

తాజాగా విడుదలైన ప్రోమోలో సీత, నైనిక ఇద్దరి ఆట తీరు, ప్రవర్తన, తప్పుల గురించి మాట్లాడారు. అనంతరం మణికంఠను నిల్చొబెట్టి సీత బాడీ లాంగ్వేజ్ లో నీకు సమస్య ఏంటీ అని అడగ్గా.. తను వెక్కిరించినట్లు అనిపించిందని చెప్పాడు. దీంతో మధ్యలో సీత కల్పించుకుని.. మణినే అందరినీ కార్నర్ చేస్తున్నాడనిపిస్తోందని చెప్పింది. దీని తర్వాత నాగార్జున, మణికంఠను యాక్షన్ రూంలోకి రమ్మన్నాడు. నీకు 8 నిమిషాలు టైమ్ ఇస్తున్నాను.. నువ్వు ఎంత ఏడవాలనుకుంటున్నావో అంత ఏడ్చేసేయ్ అని నాగ్ చెప్పగా.. ఆల్మోస్ట్ అయిపోయింది సర్ అంటూ ఏదో కవర్ చేశాడు నాగ్. ఒకవేళ కన్నా నా దగ్గరికి రావొద్దు, అక్కడే ఉండిపో అని ప్రియ చెప్పిందనుకో అని నాగ్ అనగానే నాకు భయమేస్తుందంటూ ఏడవడం స్టార్ట్ చేశాడు మణికంఠ.

నీకు చెప్పాల్సిన విషయం ఇంకోటి ఉంది… ఏడవడం నీ స్ట్రాటజీ అయితే అది పనికిరాదు. హౌస్ అందరికీ తెలుసు అని మణికంఠకు స్మూ్త్ వార్నింగ్ ఇచ్చాడు. హౌస్ లో మొదటి వారం నుంచి ఎమోషన్ చూపిస్తూ.. ప్రతిసారి ఏడుస్తూ కనిపిస్తున్నాడు మణి. హౌస్ మొత్తం అతడినే టార్గెట్ చేస్తూ నామినేట్ చేయడంతో జనాల్లో సింపథి ఎక్కువగానే వర్కౌట్ అయి ఓటింగ్ కూడా ఎక్కువగానే వస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం