Bigg Boss 8 Telugu: తొలి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హరి తేజ.. మూడేళ్ల కూతురిని వదిలి మళ్లీ బిగ్ బాస్‌లోకి..

చాలా మంది ఊహించినట్లే బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ లోనూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు అడుగు పెట్టారు. ఇందుకోసం ఆదివారం (అక్టోబర్ 06) 'బిగ్ బాస్ ది గ్రాండ్ రీలోడ్ ఈవెంట్' నిర్వహించారు. ఇందులో భాగంగా ఎనిమిదో సీజన్ లో మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ప్రముఖ నటి హరి తేజ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది

Bigg Boss 8 Telugu: తొలి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హరి తేజ.. మూడేళ్ల కూతురిని వదిలి మళ్లీ బిగ్ బాస్‌లోకి..
Bigg Boss 8 Telugu, Hari Teja
Follow us
Basha Shek

|

Updated on: Oct 06, 2024 | 9:06 PM

చాలా మంది ఊహించినట్లే బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ లోనూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు అడుగు పెట్టారు. ఇందుకోసం ఆదివారం (అక్టోబర్ 06) ‘బిగ్ బాస్ ది గ్రాండ్ రీలోడ్ ఈవెంట్’ నిర్వహించారు. ఇందులో భాగంగా ఎనిమిదో సీజన్ లో మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ప్రముఖ నటి హరి తేజ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది. సీరియల్స్‌, సినిమాలతో బాగా పాపులరైన ఆమె బిగ్ బాస్ మొదటి సీజన్ లోనూ కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. తన ఆట, మాట తీరుతో బుల్లితెర అభిమానుల మనసులు గెల్చుకుంది. గ్రాండ్ ఫినాలే వరకు చేరకుని సెకెండ్ రన్నరప్‌గా నిలిచింది. మరి ఇప్పుడు బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌లో వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిందీ అందాల తార. మూడేళ్ల కూతురిని వదిలేసి మరీ ఈ బుల్లితెర రియాలిటీ షోలో ఎంట్రీ ఇచ్చింది హరి తేజ. మరి ఈసారి కూడా ఆమె గ్రాండ్ ఫినాలేకు చేరుకుంటుందా? లేదా? అన్నది మరికొన్ని రోజుల్లో తెలియనుంది. ఈ సందర్భంగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, టాలీవుడ్ ప్రముఖ హీరో నవదీప్ హరి తేజకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ఒక వీడియోను పంపించారు. కాగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందుకు తన మూడేళ్ల కూతురితో కలిసి స్టేజి పైకి వచ్చింది హరితేజ. ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి

కాగా  సీరియల్స్‌, సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది హరి తేజ.  ముఖ్యంగా బిగ్ బాస్ తర్వాత సినిమాల్లో బిజీ అవడమే కాకుండా యాంకర్ గానూ అవతారమెత్తిందీ అందాల తార.  ఫిదా మీ ఫేవరెట్‌ స్టార్‌తో, పండగ చేస్కో, సూపర్‌ సింగర్‌, లక్కీ ఛాన్స్‌.. ఇలా పలు షోలకు యాంకర్‌గా వ్యవహరించి బుల్లితెర ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది.

ఇక అఆ, యూ ట‌ర్న్, అరవింద సమేత వీర రాఘవ, ప్రతిరోజు పండగే, హిట్‌ చిత్రాల్లోనూ నటించింది హరితేజ. ఇటీవలే రిలీజైన ఎన్టీఆర్ దేవర సినిమాలో హీరోయిన్‌ ఫ్రెండ్‌గా మెప్పించిందీ ముద్దుగుమ్మ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా