AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jahnavi Dasetty: తల్లి కాబోతున్న మహాతల్లి.. బ్యూటిఫుల్ వీడియోతో శుభవార్త చెప్పిన నటి జాహ్నవి

యూట్యూబ్‌ బాగా ఫాలో అయ్యే వారికి మహా తల్లి అలియాస్ జాహ్నవి దాశెట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఆల్మోస్ట్ మొదటి యూట్యూబర్‌గా జాహ్నవికి మంచి గుర్తింపు ఉంది. 'మహా తల్లి' అనే యూట్యూబ్ ఛానెల్ పేరుతో జాహ్నవి చేసే వీడియోలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

Jahnavi Dasetty: తల్లి కాబోతున్న మహాతల్లి.. బ్యూటిఫుల్ వీడియోతో శుభవార్త చెప్పిన నటి జాహ్నవి
Actress Jahnavi Dasetty
Basha Shek
|

Updated on: Oct 06, 2024 | 7:43 PM

Share

యూట్యూబ్‌ బాగా ఫాలో అయ్యే వారికి మహా తల్లి అలియాస్ జాహ్నవి దాశెట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఆల్మోస్ట్ మొదటి యూట్యూబర్‌గా జాహ్నవికి మంచి గుర్తింపు ఉంది. ‘మహా తల్లి’ అనే యూట్యూబ్ ఛానెల్ పేరుతో జాహ్నవి చేసే వీడియోలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ కారణంగానే జాహ్నవి పేరుకంటే మహాతల్లి పేరుతోనే బాగా ఫేమస్ అయ్యింది. ఫేమస్ యూట్యూబర్ గా, నటిగా దూసుకెళుతోన్న జాహ్నవి ఇప్పుడు తన జీవితంలో మరో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్ట నుంది. త్వరలోనే ఆమె తల్లిగా ప్రమోషన్ పొందనుంది. కొన్నాళ్ల క్రితం సుశాంత్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందీ అందాల తార. ఇప్పుడు తమ వైవాహిక బంధానిక ప్రతీకగా ఒక పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించనుంది మహా తల్లి. ఈ శుభవార్తను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. తాను తల్లి కాబోతున్నానని, మూడు నెలల క్రితమే ప్రెగ్నెన్సీ వచ్చిందనే విషయాన్ని రివీల్ చేసింది. తన ప్రెగ్నెన్సీ విషయం భర్తకు చెప్పగానే ఇలా రియాక్ట్ అయ్యాడని ఓ బ్యూటిఫుల్ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు జాహ్నవి దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

జాహ్నవి సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్. నిఫ్ట్‌లో ఫ్యాషన్ టెక్నాలజీ చదివింది. కానీ షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించింది. మొదట్లో షార్ట్‌ ఫిలిం డైరెక్టర్‌ హరీశ్‌ నాగరాజుతో కలిసి కొన్ని లఘుచిత్రాలకు వర్క్ చేసింది. అందులో భాగంగానే మహాతల్లి- మహానుభావుడు అనే వెబ్‌సిరీస్‌లో నటించింది. దీని తర్వాత జాహ్నవి పేరు బాగా మార్మోగిపోయింది. ఆ తర్వాతే మహా తల్లి పేరుతో తనే సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది. వెబ్ సిరీస్ లు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇవి కూడా చదవండి

భర్తతో శుభవార్త చెబుతోన్న మహాతల్లి.. క్యూట్ వీడియో..

అన్నట్లు జాహ్నవి కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించింది. నితిన్ లై, శ్రీ విష్ణు మెంటల్‌ మదిలో సినిమాల్లో మహా తల్లి మెరిసింది.

భర్తతో మహా తల్లి అలియాస్ నటి జాహ్నవి..

View this post on Instagram

A post shared by Sushanth (@isushanthreddy)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..