AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vanitha Vijaykumar: నటి వనిత నాలుగో పెళ్లి.. అసలు నిజం ఇదే.. అందరినీ ఫూల్స్ చేసేసిందిగా..

సినిమా విషయాల కంటే తన వ్యక్తి గత జీవితంతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచిందామె. ముఖ్యంగా పెళ్లి విషయాలతో వనిత పేరు తరచూ వార్తల్లో వినిపించసాగింది. ఇప్పటికే ఆమెకు మూడు సార్లు వివాహమైంది. కానీ ఎవరితోనూ బంధం నిలవలేదు. ఈ క్రమంలో గత కొన్ని రోజుల నుంచి వనిత నాలుగో పెళ్లి చేసుకోనుంది అంటూ తీవ్ర ప్రచారం జరుగుతోంది. గత కొన్నాళ్లుగా రిలేషన్‌లో ఉన్న కొరియోగ్రాఫర్ రాబర్ట్‌తోనే ఆమె మరోసారి ఏడడుగులు వేయనుందని గుస గుసలు వినిపించాయి

Vanitha Vijaykumar: నటి వనిత నాలుగో పెళ్లి.. అసలు నిజం ఇదే.. అందరినీ ఫూల్స్ చేసేసిందిగా..
Vanitha Vijay Kumar
Basha Shek
|

Updated on: Oct 05, 2024 | 2:34 PM

Share

తమిళ ప్రముఖ నటి వనితా విజయ్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైందీ అందాల తార. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అయితే సినిమా విషయాల కంటే తన వ్యక్తి గత జీవితంతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచిందామె. ముఖ్యంగా పెళ్లి విషయాలతో వనిత పేరు తరచూ వార్తల్లో వినిపించసాగింది. ఇప్పటికే ఆమెకు మూడు సార్లు వివాహమైంది. కానీ ఎవరితోనూ బంధం నిలవలేదు. ఈ క్రమంలో గత కొన్ని రోజుల నుంచి వనిత నాలుగో పెళ్లి చేసుకోనుంది అంటూ తీవ్ర ప్రచారం జరుగుతోంది. గత కొన్నాళ్లుగా రిలేషన్‌లో ఉన్న కొరియోగ్రాఫర్ రాబర్ట్‌తోనే ఆమె మరోసారి ఏడడుగులు వేయనుందని గుస గుసలు వినిపించాయి. అందుకు తగ్గట్టుగానే మూడు రోజుల క్రితం రాబర్ట్‌కి ప్రపోజ్ చేస్తున్నట్లు ఉన్న ఒక ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది వనిత. దీనికి ‘అక్టోబరు 5వ తేదీని గుర్తుంచుకోండి’ అని క్రేజీ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. దీంతో దీనిని చూసిన అందరూ వనిత నాలుగు పెళ్లికి రెడీ అయిపోయిందని ఫిక్స్ అయిపోయారు. ఆమె నాలుగో పెళ్లి ప్రచారం నిజమే అనుకున్నారు.

అయితే ఇప్పుడు ఇదంతా సినిమా స్టంట్ అని క్లియర్ గా అర్థమైంది. తన లేటెస్ట్ మూవీ ‘మిసెస్ & మిస్టర్’ కోసమే ఇంతా హంగామా చేసింది వనిత. ఇందులో ఆమెతో పాటు రాబర్ట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. స్వయంగా వనితనే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తోంది. నటి కూతురు జోవికా నిర్మాతగా వ్యవహరిస్తోంది. శనివారం (అక్టోబర్ 05) వనితా విజయ కుమార్ పుట్టిన రోజు. ఈ సందర్భంగానే మిసెస్ అండ్ మిస్టర్ సినిమాకు సంబంధించి అప్డేట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇదంతా తమ కొత్త మూవీ కోసం చేసిన ప్రమోషనల్ స్టంట్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఇంకొందరు నెటిజన్లు వనితపై మండి పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

వనితా, రాబర్ట్ ల ప్రపోజల్ ఫొటో..

కొత్త సినిమా ప్రకటన..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?