Bigg Boss 8 Telugu: కుర్రాళ్ల ఫేవరెట్ మళ్లీ వచ్చేసింది.. మూడో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా నయని పావని

బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ మూడో వైల్డ్ కార్డ్ స్టెంట్‌ గా కుర్రాళ్ల ఫేవరెట్ నయని పావని ఎంట్రీ ఇచ్చింది. టిక్ టాక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ తో బాగా పాపులరైన ఈ హాట్ బ్యూటీ ఏడో సీజన్‌లోనూ వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌గా హౌస్‌ లోకి అడుగుపెట్టింది. అక్కడ అందరి కంటెస్టెంట్లతోనూ ఇట్టే కలిసిపోయింది. అయితే దురదృష్టం కొద్దీ వారానికే ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది

Bigg Boss 8 Telugu: కుర్రాళ్ల ఫేవరెట్ మళ్లీ వచ్చేసింది.. మూడో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా నయని పావని
Nayani Pavani
Follow us
Basha Shek

|

Updated on: Oct 06, 2024 | 9:06 PM

బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ మూడో వైల్డ్ కార్డ్ స్టెంట్‌ గా కుర్రాళ్ల ఫేవరెట్ నయని పావని ఎంట్రీ ఇచ్చింది. టిక్ టాక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ తో బాగా పాపులరైన ఈ హాట్ బ్యూటీ ఏడో సీజన్‌లోనూ వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌గా హౌస్‌ లోకి అడుగుపెట్టింది. అక్కడ అందరి కంటెస్టెంట్లతోనూ ఇట్టే కలిసిపోయింది. అయితే దురదృష్టం కొద్దీ వారానికే ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. దీంతో ఆమె అభిమానులు బాగా ఫీలయ్యారు. ఇది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ బిగ్ బాస్ నిర్వాహకులపై మండి పడ్డారు. అయితే హౌస్ లో ఉన్నది వారం రోజులే అయినప్పటికీ తన ఆట, మాట తీరుతో అందరి మనసులు గెల్చుకుంది నయని పావని. అందంతోనూ కుర్రాళ్ల ఫేవరెట్ గా మారిపోయింది. ఈ కారణంగానే హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక గత కొన్ని రోజుల నుంచి బిగ్ బాస్ వైల్డ్ కార్ట్ కంటెస్టెంట్ల లిస్టులో నయని పేరు ప్రముఖంగా వినిపిస్తూ వస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఈ సీజన్ లోనూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిందీ అందాల తార. మరి ఈ సారి ఎన్ని రోజులు హౌస్‌లో ఉంటుందో చూడాలి.

ఈ సందర్భంగా ప్రముఖ నటుడు, బిగ్ బాస్ గత సీజన్ కంటెస్టెంట్ శివాజీ నయని పావనికి ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్పారు. హౌస్‌లోనూ, బయట అందరి మనసులు గెల్చుకోవాలని సూచించాడు. ఎంట్రీ సందర్భంగా నబీల్ అఫ్రిదీ, నిఖిల్, పృథ్వీలకు పలు సాంగ్స్ ను డెడికేట్ చేసిందీ ముద్దుగుమ్మ.

ఇవి కూడా చదవండి

కాగా అంతకు ముందు హరితేజ, టేస్టీ తేజ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లుగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా