Brahmamudi, October 9th Episode: అనామికకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన కనకం.. బెడ్‌పై రాజ్, కావ్యల రొమాన్స్..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్యని కాపాడేందుకు అగ్రిమెంట్స్ పేపర్స్ దొంగతనం చేయడానికి అనామిక ఆఫీస్‌కి వెళ్తుంది. పేపర్స్ తీసుకుని వెళ్లేలోపు అనామిక ఎంట్రీ ఇచ్చి కనకానికి షాక్ ఇస్తుంది. ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఇవ్వకపోతే.. పోలీసులను పిలిచి జైలుకు పంపిస్తానని బెదిరిస్తుంది అనామిక. దీంతో పేపర్స్ అక్కడ పడేస్తుంది కనకం. అది అలా బుద్ధిగా వెళ్లి.. కావ్యని పంపించమని అనామిక అంటే.. లేకపోతే ఏం చేస్తావే..

Brahmamudi, October 9th Episode: అనామికకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన కనకం.. బెడ్‌పై రాజ్, కావ్యల రొమాన్స్..
BrahmamudiImage Credit source: disney hotstar
Follow us
Chinni Enni

|

Updated on: Oct 09, 2024 | 10:56 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్యని కాపాడేందుకు అగ్రిమెంట్స్ పేపర్స్ దొంగతనం చేయడానికి అనామిక ఆఫీస్‌కి వెళ్తుంది. పేపర్స్ తీసుకుని వెళ్లేలోపు అనామిక ఎంట్రీ ఇచ్చి కనకానికి షాక్ ఇస్తుంది. ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఇవ్వకపోతే.. పోలీసులను పిలిచి జైలుకు పంపిస్తానని బెదిరిస్తుంది అనామిక. దీంతో పేపర్స్ అక్కడ పడేస్తుంది కనకం. అది అలా బుద్ధిగా వెళ్లి.. కావ్యని పంపించమని అనామిక అంటే.. లేకపోతే ఏం చేస్తావే.. దుగ్గిరాల ఫ్యామిలీని కాదని జైలుకు వెళ్లిన నువ్వు నన్ను బెదిరిస్తావా.. నువ్వు నా ఇంటి ముందుకు వచ్చి గిలగిలమని చచ్చినా.. నా కూతుర్ని నీ ఆఫీస్‌కి పంపించేదే లేదని కనకం వార్నింగ్ ఇస్తుంది. నేను తలుచుకుంటే ఏం చేస్తానో తెలుసా? అని అనామిక అంటే.. యహే ఆపు.. ఈ కనకం గురించి నీకు సరిగ్గా తెలీదు. ఆ రుద్రాణి.. నీ మాజీ అత్తను అడుగు.. కథలు కథలుగా చెప్తారు జరుగు.. ఏం చేసుకుంటావో చేసుకోమని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది కనకం.

అనామికకు వార్నింగ్ ఇచ్చిన అనామిక..

ఆ తర్వాత మెల్లిగా ఎవరూ చూడకుండా ఇంటికి వస్తుంది కనకం. అమ్మా ఎక్కడికి వెళ్లి వస్తున్నావ్? కొంపతీసి మా అత్తారింటికి వెళ్లి గొడవ పెట్టుకుని వచ్చావా.. ఏం చేసి వచ్చావో చెప్పమని కావ్య అడుగుతుంది. అనామికకు వార్నింగ్ ఇవ్వడానికి వెళ్లానని చెబుతుంది కనకం. దీంతో కావ్యకు కనకాన్ని తిడుతుంది. నీకు దణ్ణం పెట్టకే.. నన్ను తిట్టకే. నిన్ను జైలుకు పంపిస్తానని చెప్పడంతో.. అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొద్దామని వెళ్లాను. కానీ ఇంతలో అనామిక వచ్చేసింది. జైలుకు పంపిస్తానని అనేసరికి.. వార్నింగ్ ఇచ్చానని కనకం చెబుతుంది. ఎందుకు అమ్మా మనకు ఇప్పుడు ఉన్న సమస్యలు చాలవా.. మళ్లీ ఇప్పుడు కొత్తవి తీసుకొస్తావా అని కనకం అంటుంది.

బెడ్‌పై రాజ్, కావ్యల రొమాన్స్..

కట్ చేస్తే.. రాజ్ పడుకుని ఉంటాడు. అప్పుడే కావ్య బెడ్‌పైకి వస్తుంది. ఇప్పుడు మంచి సాంగ్ ప్లే అవుతుంది. మెల్లగా రాజ్‌ని లేపుతుంది. హేయ్ నువ్వా.. ఏం మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు? ఎంత ధైర్యమే నీకు? సిగ్గు లేకుండా నా ఎదురు పడతావా? వెళ్తావా.. లేదా అని రాజ్ అంటాడు. ఆగండి.. నేను తప్పు చేశానంటే మీ మనసు ఒప్పుకుంటుందా అని కావ్య అంటే.. లేదని రాజ్ అంటాడు. మరి ఇంకా కోపం ఎందుకు అని కావ్య అడుగుతుంది. అయినా సరే అదంతా నా కళ్ల ముందే జరిగింది. నా ఎదురు నువ్వు అవార్డు కూడా తీసుకున్నావ్? మీ భార్య అవార్డు గెలుచుకుంటే.. మీకు కూడా అవార్డు వచ్చినట్టే కదా.. అయినా మీరు నన్ను వదిలేస్తే.. నా బతుకు తెరువు కోసం ఓ ఉద్యోగం వెతుక్కున్నా. కానీ ఆ అనామిక నన్ను మోసం చేసిందని కావ్య అంటే.. నేనేమీ నిన్ను వెళ్లమనలేదు.. నువ్వే పెద్ద డైలాగ్స్ చెప్పి వెళ్లిపోయావని రాజ్ అంటాడు.

ఇవి కూడా చదవండి

కలలో కూడా నిన్ను క్షమించను..

కావ్య చిలిపిగా బుగ్గ గిల్లుతుంది. దీంతో రాజ్ కూడా కావ్య బుగ్గలు గిల్లుతాడు. అప్పుడే రాజ్ కావ్యని గట్టిగా పట్టుకుంటుంది. నేను నిజంగా మీకు ద్రోహం చేయలేదు. మీరంటే నాకు ప్రాణం. నేను అలాంటి దాన్ని కాదండీ.. నన్ను నమ్మని కావ్య అంటుంది. ఏయ్ ఏంటిది.. నిన్ను ఏం చేసినా క్షమించేది లేదు.. వెళ్లు వెళ్లమని రాజ్ అంటాడు. అదంతా రాజ్ కల కంటాడు. ఆ తర్వాత హాల్‌లోకి వచ్చి పడుకుంటాడు రాజ్. అప్పుడు కూడా కావ్య వచ్చి.. ఏవండీ నేను చెప్పేది వినమని అంటుంది. దీంతో రాజ్ దుప్పటి కప్పుకుని పడుకుంటాడు.

హాలులో పడుకున్న రాజ్..

ఉదయం తెల్లారాక అపర్ణ, ఇందిరా దేవిలు వచ్చి ఇదేంటి? వీడు ఇక్కడ పడుకున్నాడని అడుగుతారు. కావ్య విషయం చెప్పకుండా.. రాజ్ ఏసీ పని చేయలేదని.. దోమలు ఉన్నాయని కథలు చెప్తాడు. నాకు అర్థమైంది.. కావ్య నీకు గుర్తుకు వచ్చి ఒంటరిగా పడుకోలేక వచ్చావు కదా అని ఇందిరా దేవి అంటే.. అంత లేదు.. దాని పేరు ఎందుకు తీసుకొస్తున్నారని రాజ్ అంటాడు. నాకు అర్థమైందిరా.. నీకు అంతా నీ తాత పోలికలే అని పెద్దావిడ అంటుంది. ఆ కళావతి నాకు వెన్ను పోటు పొడిచి వెళ్లింది. కాబట్టి నాకు ఎలాంటి బాధ లేదని రాజ్ అనేసి వెళ్తాడు. వీడి మాటలకు భయంగా ఉంది. వీడేమో ఇలా.. ఆ కావ్య ఏమో పంతంగా ఉందని అపర్ణ అంటుంది. లాభం లేదు.. వీళ్లిద్దర్నీ ఒకే చోట కలపాల్సిందేనని ఇందిరా దేవి అంటుంది. అప్పుడే అపర్ణ, పెద్దావిడకు కనకం గుర్తొస్తుంది.

కనకం, అపర్ణ, ఇందిరా దేవిల ప్లాన్..

కట్ చేస్తే.. కనకాన్ని గుడిలో కలుస్తారు. కొబ్బరి చిప్ప తింటూ కనిపిస్తుంది కనకం. చిప్ప తినడాన్ని చూసి.. నీలో కోతి లక్షణాలు ఉన్నాయని పెద్దావిడ అంటుంది. ఎందుకు కలవాలి అనుకున్నారు వదినా అని కనకం అంటే.. నీ కూతురి కాపురం గురించి మాట్లాడానికే వచ్చామని అంటారు. కనకం.. నీ కూతురికి.. నా కొడుక్కి గోరోజనం బాగా పెరిగిపోయింది. నీ కూతురు రాదు.. నా కొడుకు పిలవడు.. ఇలాగే వదిలేస్తే ఎలా అని ఇందిరా దేవి, అపర్ణలు అంటారు. కూతురు ఇంటికి వస్తే.. తిట్టి పంపించకుండా.. ఉద్యోగానికి బయటకు పంపుతావా అని అపర్ణ అంటుంది. అత్తగారింట్లో కూడు, నీడ లేదని రాలేదు.. భర్తకి ప్రేమ లేదని వచ్చింది. ఏం చేప్తే తిరిగి వెళ్తుందో తెలీక నేను, మా ఆయన తల బాదుకుంటున్నాం. ఏదో ఒకటి చేయాలి.. ఏం చేయాలో అర్థం కావడం లేదని పెద్దావిడ, అపర్ణలు అంటారు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!