AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss: మీ వినోదం కోసం జంతువులను వాడుకుంటారా? బిగ్ బాస్‌ హౌస్‌లోకి గాడిదను తీసుకురావడంపై పెటా ఆగ్రహం

'బిగ్ బాస్'లో ప్రముఖ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఇంకా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కంటెస్టెంట్స్ గా వస్తుంటారు. షో సక్సెస్ కావాలంటే హౌస్ మేట్స్ ఎంపికనే కీలకం. ఇందుకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు బిగ్ బాస్ నిర్వాహకులు.

Bigg Boss: మీ వినోదం కోసం జంతువులను వాడుకుంటారా? బిగ్ బాస్‌ హౌస్‌లోకి గాడిదను తీసుకురావడంపై పెటా ఆగ్రహం
Bigg Boss
Basha Shek
|

Updated on: Oct 09, 2024 | 1:48 PM

Share

‘బిగ్ బాస్’లో ప్రముఖ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఇంకా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కంటెస్టెంట్స్ గా వస్తుంటారు. షో సక్సెస్ కావాలంటే హౌస్ మేట్స్ ఎంపికనే కీలకం. ఇందుకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే ఈసారి హిందీ బిగ్ బాస్ హౌస్‌లోకి గాడిదను కూడా తీసుకెళ్లారు. దీనిని కూడా కంటెస్టెంట్ గా పరిగణిస్తున్నారు. దీనిపై జంతు హక్కుల పరిరక్షణ వేదిక ‘పెటా’ తీవ్రంగా మండిపడింది. ఇలాంటి రియాల్టీ షోలో జంతువులను ఉపయోగించుకోవడం చాలా నేరమని నిర్వాహకులకు లేఖ రాసింది పెటా. బిగ్ బాస్ హౌస్‌లో గాడిదను తీసుకురావడంపై జంతు ప్రేమికుల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదులు వస్తున్నాయి. మేం వీటిని పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఎలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వాటిని విస్మరించలేం. దయచేసి బిగ్ బాస్ నుండి జంతువులను దూరంగా ఉంచండి’ అని రియాలిటీ షో నిర్వాహకులకు లేఖ రాశారు పెటా ప్రతినిధులు.

‘భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా, బిగ్ బాస్ హోస్ట్‌గా రోల్ మోడల్‌గా మీరు (సల్మాన్ ఖాన్) ఎందరికో ఆదర్శం. దయచేసి వినోదం కోసం జంతువులను బాధ పెట్ట వద్దని మీరు ఛానెల్ నిర్వాహకులకు చెప్పండి’ అని లేఖలో సల్మాన్ ను అభ్యర్థించారు పెటా ప్రతినిధులు. బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తోన్న ఈ గాడిద పేరు మ్యాక్స్. ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా వచ్చిన ప్రముఖ అడ్వకేట్ గుణరత్న సదావర్తే తనతో పాటు గాడిదను కూడా తీసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో స్పందించిన పెటా గాడిదను తమకు అప్పగించాలని కోరారు. గాడిదలు భయపడతాయి. వెలుతురు, శబ్దం వల్ల అవి తీవ్రంగా ఇబ్బంది పడతాయి. కాబట్టి, షో నుంచి వాటిని దూరంగా ఉంచండి’ అని బిగ్ బాస్ నిర్వాహకులను కోరారు పెటా ప్రతినిధులు.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ హౌస్ లో గాడిద..

‘బిగ్ బాస్’లో ఓ జంతువును తీసుకురావడం ఇదే తొలిసారి. దీన్ని పలువురు వ్యతిరేకించారు. బిగ్ బాస్ షో ఆదివారం (అక్టోబర్ 6) గ్రాండ్ గా ఓపెనింగ్ అయింది. చాలా మంది సెలబ్రిటీలు ఇందులో భాగమయ్యారు. సల్మాన్ ఖాన్ స్వయంగా గాడిదను బిగ్ బాస్ వేదికపైకి తీసుకురావడంతో అభిమానులు, ఆడియెన్స్ షాక్ కు గురయ్యారు.

గాడిదలు భయపడతాయి: పెటా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్