Ajay: ఈ టాలీవుడ్ విలన్‌కు హీరోయిన్‌లాంటి భార్య.. అజయ్ ఫ్యామిలీ ఫొటోస్ చూశారా?

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు అజయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సుమారు ఇరవై ఎళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతోన్న అజయ్‌ విలన్‌గా, సహాయ నటుడిగా వందలాది చిత్రాల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా రవితేజ నటించిన ‘విక్రమార్కుడు’ సినిమాలో అజయ్ పోషించిన టిట్లా పాత్ర ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఆ తర్వాత ఆర్య 2, దూకుడు, రాజన్న, ఇష్క్, గబ్బర్ సింగ్, అల వైకుంఠ పురం..

Ajay: ఈ టాలీవుడ్ విలన్‌కు హీరోయిన్‌లాంటి భార్య.. అజయ్ ఫ్యామిలీ ఫొటోస్ చూశారా?
Ajay Family
Follow us
Basha Shek

|

Updated on: Oct 09, 2024 | 12:44 PM

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు అజయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సుమారు ఇరవై ఎళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతోన్న అజయ్‌ విలన్‌గా, సహాయ నటుడిగా వందలాది చిత్రాల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా రవితేజ నటించిన ‘విక్రమార్కుడు’ సినిమాలో అజయ్ పోషించిన టిట్లా పాత్ర ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఆ తర్వాత ఆర్య 2, దూకుడు, రాజన్న, ఇష్క్, గబ్బర్ సింగ్, అల వైకుంఠ పురం, సరిలేరు నీకెవ్వరు, 18 పేజీస్‌,విరూపాక్ష, పుష్ప, సరిపోదా శనివారం, మారుతీ నగర్ సుబ్రమణ్యం, మత్తు వదలరా 2 ..ఇలా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు అజయ్. అన్నట్లు సారాయి వీర్రాజు సినిమాతో అదృష్టం పరీక్షించుకున్నాడు అజయ్. ఇక ఇటీవలే ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర పార్ట్-1 లోనూ పోలీసాఫీసర్ శివంగా ఓ కీలక పాత్రలో మెరిశాడు. కాగా సినిమాల సంగతి పక్కన పెడితే..   అజయ్ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదనే చెప్పుకోవాలి. ఆయన భార్య పేరు శ్వేత రావూరీ. గతంలో మోడల్ గా పనిచేసింది. 2017 మిస్ ఇండియా పోటీల్లోనూ పాల్గొని ఫైనల్స్ వరకూ వెళ్లింది. అజయ్, శ్వేతలు 2005లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అజయ్ ఫ్యామిలీ ఎక్కువగా కనిపించదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. టూర్లు, వెకేషన్స్ కు వెళ్లినప్పుడల్లా అజయ్ తో పాటు ఆయన భార్య శ్వేత తమ ఫ్యామిలీ ఫొటోస్ ను షేర్ చేస్తుంటారు. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తుంటారు. అజయ్ ఫ్యామిలీ చాలా క్యూట్ గా ఉందని, ఇక భార్య శ్వేత హీరోయిన్ కు ఏ మాత్రం తక్కువ కాదంటూ స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

దుబాయ్ వెకేషన్ లో అజయ్ ఫ్యామిలీ..

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది ఇప్పటికే అరడజనకు పైగా సినిమాల్లో కనిపించాడు అజయ్. గుంటూరు కారం, ప్రతినిధి 2, సుందర కాండ, మారుతీ నగర్ సుబ్రమణ్యం, సరిపోదా శనివారం, మత్తు వదలరా 2, దేవర సినిమాల్లో కనిపించాడు అజయ్. ప్రస్తుతం అతని చేతిలో దేవర పార్ట్ -2, పుష్ప 2 వంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

భార్య, బిడ్డలతో నటుడు అజయ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.