AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: వావ్.. వాట్ ఏ ఫీల్డింగ్.. బౌండరీ లైన్ వద్ద హార్దిక్‌ సింగిల్‌ హ్యాండ్‌ క్యాచ్‌.. వీడియో చూడండి

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా బుధవారం (అక్టోబర్ 09) బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది టీమిండియా. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు

IND vs BAN: వావ్.. వాట్ ఏ ఫీల్డింగ్.. బౌండరీ లైన్ వద్ద హార్దిక్‌ సింగిల్‌ హ్యాండ్‌ క్యాచ్‌.. వీడియో చూడండి
Hardik Pandya
Basha Shek
|

Updated on: Oct 10, 2024 | 11:51 AM

Share

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా బుధవారం (అక్టోబర్ 09) బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది టీమిండియా. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. మొదట 6వ నంబర్‌లో బ్యాటింగ్ కు దిగిన పాండ్యా కేవలం 19 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లతో 32 పరుగులు చేశాడు. ఆ తర్వాత పాండ్యా ఫీల్డింగ్‌లోనూ రాణించాడు. ముఖ్యంగా 14వ ఓవర్ లో డీప్ బౌండరీ లైన్ పై అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ పట్టాడు. వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్ 3వ బంతిని డీప్ మిడ్ వికెట్‌ మీదుగా భారీ షాట్ కొట్టాడు హార్దిక్ పాండ్యా. దీంతో బౌండరీ లైన్‌ వద్ద ఉన్న హార్దిక్‌ పాండ్య.. చాలా దూరం పరుగెత్తుకుంటూ వచ్చి అసాధ్యమైన రీతిలో ఒంటిచేత్తో ఒడిసిపట్టాడు. దీంతో స్టేడియంలోని ప్రేక్షకులు హోరెత్తిపోయారు. ఈ అద్భుతమైన క్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన క్రికెట్ అభిమానులు, నెటిజన్లు పాండ్యాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నితేష్ రెడ్డి (74), రింకూ సింగ్ (53) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 86 పరుగుల తేడాతో భారత్ భారీ విజయం సాధించింది. అలాగే 2-0 తేడాతో సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్.

బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), పర్వేజ్ హసన్ ఎమోన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), జాకర్ అలీ, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, మెహదీ హసన్ మిరాజ్, రిషాద్ హొస్సేన్, మస్తాఫిజుర్ రెహమాన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ షకీబ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్