Tollywood: ఈ బాలకృష్ణుడిని గుర్తుపట్టారా? హీరో మాత్రం కాదు అంతకు మించి.. తెలిస్తే నోరెళ్లబెడతారు

పై ఫొటోలో ఒంటికాలిపై బాల కృష్ణుని గెటప్ లో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఈ పిల్లాడు ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమను ఏలేస్తున్నాడు. చిన్నప్పుడు శ్రీకృష్ణుడి గెటప్ వేశాడంటే పెద్దయ్యాక ఏ స్టార్ హీరో లేదా స్టార్ యాక్టర్ అయి ఉంటాడులే అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే

Tollywood: ఈ బాలకృష్ణుడిని గుర్తుపట్టారా? హీరో మాత్రం కాదు అంతకు మించి.. తెలిస్తే నోరెళ్లబెడతారు
Tollywood Director
Follow us
Basha Shek

|

Updated on: Oct 10, 2024 | 1:18 PM

పై ఫొటోలో ఒంటికాలిపై బాల కృష్ణుని గెటప్ లో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఈ పిల్లాడు ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమను ఏలేస్తున్నాడు. చిన్నప్పుడు శ్రీకృష్ణుడి గెటప్ వేశాడంటే పెద్దయ్యాక ఏ స్టార్ హీరో లేదా స్టార్ యాక్టర్ అయి ఉంటాడులే అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే. అతను అసలు హీరో మెటీరియల్ కాదు అంతకు మించి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కదా.. అదే నండి డైరెక్టర్. పై ఫొటోలో కృష్ణుడి గెటప్ లో ఉన్నది కూడా ఒక టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్. పేరుకు తెలుగు డైరెక్టర్ అయినప్పటికీ అతని ప్రతిభ, కీర్తి ప్రపంచం మొత్తానికి తెలుసు. తెలుగులో పాన్ ఇండియా సినిమాలకు పునాది వేసిందే ఆయన. నీళ్లు తాగినంత ఈజీగా ఆయన సినిమాలు 1000 కోట్ల కలెక్షన్లు రాబడుతుంటాయి. త్వరలోనే ఓ సూపర్ స్టార్ తో పాన్ వరల్డ్ మూవీ కోసం ప్రస్తుతం సన్నాహాలు చేసుకుంటున్నాడీ స్టార్ డైరెక్టర్. కెరీర్ లో ఒక్క పరాజయం కూడా లేని ఈ క్రేజీ డైరెక్టర్ ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది యస్.. ఆ కృష్ణుడి గెటప్ లో ఉన్నది మరెవరో కాదు దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి. గురువారం (అక్టోబర్ 10) జక్కన్న పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇదే క్రమంలో రాజమౌళి చిన్ననాటి ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

మొదట ఈ ఫొటో చూసినవారిలో చాలామంది ముందుగా బాలకృష్ణుడి గెటప్ లో ఉన్నది రాజమౌళి చెల్లెలు, ప్రముఖ సంగీత దర్శకురాలు ఎమ్.ఎమ్.శ్రీలేఖ అనుకుంటారు చాలా మంది. ఎందుకంటే ఈ త్రో బ్యాక్ ఫొటోను మొదట సోషల్ మీడియాలో షేర్ చేసింది శ్రీలేఖే. అయితే ఆ బాలకృష్ణుడు శ్రీలేఖ కాదని, అక్కడ ఉన్నది రాజమౌళి అని శ్రీలేఖనే చెప్పుకొచ్చింది. కాగా రాజమౌళి ఇడస్ట్రీలోకి అడుగు పెట్టడానికి చాలా సంవత్సరాల ముందే ‘పిల్లన గ్రోవి’ అనే సినిమాలో నటించాడు. అప్పుడు అతని వయసు 12-13 ఏళ్లే. ఇందులో శ్రీలేఖ కూడా ఓ పాత్రలో కనిపించింది. కీరవాణి తండ్రి శివ శక్తి దత్తా, విజయేంద్ర ప్రసాద్ కలిసి ఈ సినిమాని నిర్మించారు. అయితే ఆ సినిమా పూర్తి కాలేదు. దీంతో విడుదలకు కూడా నోచుకోలేదు. దీంతో ఆ సినిమా వీళ్లకు చాలా నష్టాలనే మిగిల్చింది. ఇదే విషయాన్ని కొన్ని నెలల క్రితం రిలీజైన రాజమౌళి డాక్యుమెంటరీ మోడ్రన్ మాస్టర్స్ లో చూపించారు.

ఇవి కూడా చదవండి

రాజమౌళితో ఎమ్ ఎమ్ శ్రీలేఖ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.