Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma: డైరెక్టర్ ఆర్జీవీని కలిసిన పుష్ప విలన్.. ఫొటోస్ వైరల్.. ఏం ప్లాన్ చేస్తున్నారబ్బా?

భారతీయ సినిమా గతిని దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ కూడా ఒకరు. 90-2000 దశకంలో వర్మ తీసిన పలు సినిమాలు కల్ట్ క్లాసిక్స్ గా నిలిచాయి. ఆయన తెరకెక్కించిన సినిమాలను ఫిల్మ్ స్కూల్స్‌లో కూడా బోధిస్తారంటే అతి శయోక్తి కాదు. అయితే అదంతా గతం. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ సినిమాను తీసిన వర్మ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. పొలిటికల్ సినిమాలు తీస్తూ టైమ్ పాస్ చేస్తున్నాడు

Ram Gopal Varma: డైరెక్టర్ ఆర్జీవీని కలిసిన పుష్ప విలన్.. ఫొటోస్ వైరల్.. ఏం ప్లాన్ చేస్తున్నారబ్బా?
Ram Gopal Varma , Fahadh Faasil
Basha Shek
|

Updated on: Oct 11, 2024 | 6:15 PM

Share

భారతీయ సినిమా గతిని దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ కూడా ఒకరు. 90-2000 దశకంలో వర్మ తీసిన పలు సినిమాలు కల్ట్ క్లాసిక్స్ గా నిలిచాయి. ఆయన తెరకెక్కించిన సినిమాలను ఫిల్మ్ స్కూల్స్‌లో కూడా బోధిస్తారంటే అతి శయోక్తి కాదు. అయితే అదంతా గతం. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ సినిమాను తీసిన వర్మ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. పొలిటికల్ సినిమాలు తీస్తూ టైమ్ పాస్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్జీవీతో చేతులు కలిపాడు ఇండియాస్‌ టాప్‌ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఫహద్‌ ఫాసిల్‌. తాజాగా ఆయన ఆర్జీవీ డెన్ కు వెళ్లాడు. అక్కడ వర్మతో కలిసి కొన్ని ఫోటోలు దిగాడు ఫహద్. అనంతరం ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు వర్మ, ఫహద్‌ ఫాసిల్‌. ఇందులో వర్మ, పుష్ప నటుడు కలిసి ఒక ఫొటోలో ఉండగా, మరొక ఫొటోలో ఒక యువతి కెమెరాకు ఎదురుగా కూర్చుని ఉంది. ఫోటో చూస్తుంటే ఏదో సన్నివేశం చిత్రీకరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని పంచుకుంటూ రామ్ గోపాల్ వర్మ ఇలా రాసుకొచ్చాడు.. ‘ ఫాహద్ ఫాసిల్ కోసం నేను తీసిన మొదటి షాట్’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇద్దరు ఎందుకు కలిశారు? ఏం ప్లాన్ చేస్తున్నారు’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

కాగా ఇది సినిమా షూటింగ్ కాదు. ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ స్వయంగా తన మరో పోస్ట్‌లో ధృవీకరించారు. ఫహద్ ఫాసిల్ హైదరాబాద్‌లోని నా కార్యాలయానికి వచ్చారు. అది ఆ సమయంలో తీసిన ఫోటో మాత్రమేనని స్పష్టం చేశాడు. రామ్ గోపాల్ వర్మకు హైదరాబాద్‌లో పెద్ద ఆఫీస్ ఉంది. దానికి డెన్ అని పేరు పెట్టాడు. అక్కడ వర్మను కలవడానికి చాలా మంది ప్రముఖ నటులు వస్తుంటారు. గత నెలలో బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్ కూడా రామ్ గోపాల్ వర్మను కలిసేందుకు డెన్ కు వచ్చారు. ఇప్పుడు ఫహద్ ఫాసిల్ వచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఆర్జీవీతో ఫాహద్ ఫాజిల్..

కాగా  రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేస్తున్నా.. ఆయన పాత సినిమాలను చూసి ఆదరించేవాళ్లు ఇప్పటికీ ఉన్నారు. నేటి అగ్ర దర్శకులు రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్ తదితరులు కూడా వర్మను ఆదర్శంగా తీసుకుంటారు.

ఆర్జీవీ డెన్ లో పుష్ప విలన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇదేందయ్యా ఇది.. యాడా చూడలే.. రోడ్డు మధ్య కరెంట్ పోల్స్..
ఇదేందయ్యా ఇది.. యాడా చూడలే.. రోడ్డు మధ్య కరెంట్ పోల్స్..
అందాల లక్క బొమ్మలకు మరో అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డు
అందాల లక్క బొమ్మలకు మరో అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డు
బ్యాక్‌ బెంచర్స్‌ అనే పదం ఇక చరిత్రే.. ఆ స్కూల్‌లో నయా విప్లవం!
బ్యాక్‌ బెంచర్స్‌ అనే పదం ఇక చరిత్రే.. ఆ స్కూల్‌లో నయా విప్లవం!
ముఖానికి రోజూ పెరుగు రాస్తే..మచ్చల్లేని అందమైన ముఖం మీ సొంతం!
ముఖానికి రోజూ పెరుగు రాస్తే..మచ్చల్లేని అందమైన ముఖం మీ సొంతం!
తల్లిదండ్రులకు బిగ్ అప్డేట్.. ఇలా చేయకపోతే మీ పిల్లల ఆధార్ రద్దు
తల్లిదండ్రులకు బిగ్ అప్డేట్.. ఇలా చేయకపోతే మీ పిల్లల ఆధార్ రద్దు
ఇన్‌స్టాలో 5 హిల్ స్టేషన్లు హల్చల్.. ఢిల్లీ చేరువలో స్వర్గధామాలు.
ఇన్‌స్టాలో 5 హిల్ స్టేషన్లు హల్చల్.. ఢిల్లీ చేరువలో స్వర్గధామాలు.
కేంద్ర క్రీడాశాఖ మంత్రితో సీఎం చంద్రబాబు కీలక సమావేశం!
కేంద్ర క్రీడాశాఖ మంత్రితో సీఎం చంద్రబాబు కీలక సమావేశం!
ప్రేమలో పడిన టాలీవుడ్ హీరోయిన్..
ప్రేమలో పడిన టాలీవుడ్ హీరోయిన్..
మేక పాలు మాకొద్దని దూరం పెడుతున్నారా.?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
మేక పాలు మాకొద్దని దూరం పెడుతున్నారా.?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
ప్రకృతి అందాలతో కూడిన టాప్ 5 సహజ యునెస్కో వారసత్వ ప్రదేశాలు ఇవే..
ప్రకృతి అందాలతో కూడిన టాప్ 5 సహజ యునెస్కో వారసత్వ ప్రదేశాలు ఇవే..