Mohammed Siraj: హైదరాబాదీ క్రికెటర్ సిరాజ్‌కు డీఎస్పీ పోస్టు.. నియామక పత్రాలు అందజేసిన డీజీపీ

టీ20 ప్రపంచ కప్ లో సత్తా చాటిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా ఈ ఏడాది ఆగ‌స్టు నెల‌లో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 78లో 600 చదరపు గజాల స్థలాన్ని సిరాజ్‌కు కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా సిరాజ్‌కు డీఎస్పీ పోస్టు కూడా కేటాయించారు

Mohammed Siraj: హైదరాబాదీ క్రికెటర్ సిరాజ్‌కు డీఎస్పీ పోస్టు.. నియామక పత్రాలు అందజేసిన డీజీపీ
Mohammed Siraj
Follow us
Basha Shek

|

Updated on: Oct 11, 2024 | 8:54 PM

టీ20 ప్రపంచ కప్ లో సత్తా చాటిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా ఈ ఏడాది ఆగ‌స్టు నెల‌లో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 78లో 600 చదరపు గజాల స్థలాన్ని సిరాజ్‌కు కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా సిరాజ్‌కు డీఎస్పీ పోస్టు కూడా కేటాయించారు. శుక్రవారం (అక్టోబర్ 11) రాష్ట్ర డీజీపీ జితేంద‌ర్ సిరాజ్‌కు డీఎస్పీ నియామ‌క ప‌త్రాలు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిరాజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పోలీసు శాఖ‌కు ధన్యవాదాలు తెలిపారు. కాగా 2024 T20 ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియాలో భాగమయ్యాడీ హైదరాబాదీ పేసర్. టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ ఇండియా విజయం సాధించిన తర్వాత సిరాజ్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. అందుకే మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ పోలీసు శాఖలో డీఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. ఈరోజు ఆ ఉద్యోగ బాధ్యతలను కూడా సిరాజ్ స్వీకరించారు. అయితే ఇది అతని క్రికెట్ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపదు.

భారత టీ20 ప్రపంచకప్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిథ్యం వహించిన ఏకైక క్రికెటర్ సిరాజ్ ఒక్కడే కావడం గమనార్హం. అందుకే సీఎం రేవంత్ రెడ్డి అతనికి ఉద్యోగంతోపాటు భూమి కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. మహ్మద్ సిరాజ్ ఇప్పుడు అత్యుత్తమ అంతర్జాతీయ కెరీర్‌ను కలిగి ఉన్నాడు. టీమ్ ఇండియా తరఫున 29 టెస్టు మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ 78 వికెట్లు పడగొట్టాడు. ఒక ఇన్నింగ్స్‌లో 15 పరుగులకు 6 వికెట్లు పడగొట్టడం అతని అత్యుత్తమం. భారత్ తరఫున 44 వన్డేల్లో 71 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ 16 టీ20 ఇంటర్నేషనల్స్ కూడా ఆడాడు. ఇందులో 14 వికెట్లు తీశాడు.

ఇవి కూడా చదవండి

డీఎస్పీ నియామక పత్రాలతో సిరాజ్..

అభిమానుల అభినందనలు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లగచర్ల దాడి కేసులో పట్నం నరేందర్‌ రెడ్డి సహా నిందితులకు ఊరట
లగచర్ల దాడి కేసులో పట్నం నరేందర్‌ రెడ్డి సహా నిందితులకు ఊరట
శుక్రుడిపై శుభ దృష్టి.. ఆ రాశుల వారికి విలాస జీవితం పక్కా..!
శుక్రుడిపై శుభ దృష్టి.. ఆ రాశుల వారికి విలాస జీవితం పక్కా..!
అశ్విన్‌కు లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లు.. మొత్తం ఆస్తి ఎంతంటే?
అశ్విన్‌కు లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లు.. మొత్తం ఆస్తి ఎంతంటే?
ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్‌న్యూస్.. ఆ గడువు మరో నెల రోజుల పెంపు
ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్‌న్యూస్.. ఆ గడువు మరో నెల రోజుల పెంపు
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
భారత్‌లో పెరుగుతున్న షుగర్ పేషెంట్స్.. నిపుణుల సలహా ఏమిటంటే
భారత్‌లో పెరుగుతున్న షుగర్ పేషెంట్స్.. నిపుణుల సలహా ఏమిటంటే
త్రుట్టిలో తప్పించుకున్న రోహిత్.. జర్రుంటే చిక్కుల్లో పడేవాడు..!
త్రుట్టిలో తప్పించుకున్న రోహిత్.. జర్రుంటే చిక్కుల్లో పడేవాడు..!
ఎలక్ట్రిక్ బైక్ కోసం చూస్తున్నారా.? తక్కువ ధరలో ది బెస్ట్స్ ఇవే.!
ఎలక్ట్రిక్ బైక్ కోసం చూస్తున్నారా.? తక్కువ ధరలో ది బెస్ట్స్ ఇవే.!
మహేశ్ బాబు- రాజమౌళి సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
మహేశ్ బాబు- రాజమౌళి సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
వీళ్ళేం దొంగలురా సామీ.. వాటిని కూడా వదల్లేదు..!
వీళ్ళేం దొంగలురా సామీ.. వాటిని కూడా వదల్లేదు..!
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా