Team India: ఇకపై టీమిండియా టీ20 జట్టులో వీళ్లకు నో ఎంట్రీ.. లిస్ట్‌లో ముగ్గురు.. రిటైర్మెంట్ చెప్పాల్సిందే?
IND vs BAN: బంగ్లాదేశ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కి టీం ఇండియా జట్టులో బీసీసీఐ కొంతమంది కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవడంలో నితీష్ రెడ్డి, మయాంక్ యాదవ్ కూడా సక్సెస్ అయ్యారు. తొలి రెండు మ్యాచ్‌లను సులువుగా గెలిచిన టీమిండియా సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో ఉంది. మెన్ ఇన్ బ్లూ ఆటతీరు చూస్తుంటే టీ20 ఫార్మాట్‌లో భారత జట్టు ఖాయం అయినట్లే.
IND vs BAN: బంగ్లాదేశ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కి టీం ఇండియా జట్టులో బీసీసీఐ కొంతమంది కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవడంలో నితీష్ రెడ్డి, మయాంక్ యాదవ్ కూడా సక్సెస్ అయ్యారు. తొలి రెండు మ్యాచ్‌లను సులువుగా గెలిచిన టీమిండియా సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో ఉంది. మెన్ ఇన్ బ్లూ ఆటతీరు చూస్తుంటే టీ20 ఫార్మాట్‌లో భారత జట్టు ఖాయం అయినట్లే. ఇదే జట్టుతో మున్ముందు బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఒకరిద్దరు తప్ప, మిగతా వాళ్ల ప్లేస్‌లు ఈ టీ20 జట్టులో ఫిక్స్ అయినట్లేనని తెలుస్తోంది.
ఇటువంటి పరిస్థితిలో చాలా మంది కీలక ఆటగాళ్లు మళ్లీ టీమిండియా కోసం టీ20 మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. ఇకపై వీళ్లంతా వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో మాత్రమే ఆడే అవకాశం ఉంటుంది. అలాంటి లిస్ట్‌లో ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
3. శార్దూల్ ఠాకూర్..
భారత టీ20 జట్టు నుంచి రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ తప్పించి రెండున్నరేళ్లకు పైగా గడిచింది. అతను ఫిబ్రవరి 2022లో వెస్టిండీస్‌తో తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. శార్దూల్‌కి ఇప్పుడు 32 ఏళ్లు, చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. శార్దూల్ ఇప్పటివరకు 25 టీ20 మ్యాచ్‌లు ఆడగా, అందులో 33 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. టీ20 జట్టులోకి పునరాగమనంపై శార్దూల్ ఆశలు చిగురించలేదు.
2. శ్రేయాస్ అయ్యర్..
టీ20 ఫార్మాట్‌లో స్ట్రైక్ రేట్ కోసం శ్రేయాస్ అయ్యర్ ఎప్పుడూ అభిమానుల టార్గెట్. అదే సమయంలో, అయ్యర్ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విజయం సాధించలేదు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ డిసెంబర్ 2023లో ఆస్ట్రేలియాతో తన చివరి T20 మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి అతను టీ20 జట్టులోకి తిరిగి రాలేదు. అయ్యర్ ఇప్పటివరకు ఆడిన 51 టీ20 మ్యాచ్‌లలో 1104 పరుగులు చేశాడు. ఆ సమయంలో అతను తన బ్యాట్‌తో 8 అర్ధ సెంచరీలు చేశాడు.
1. కేఎల్ రాహుల్..
భారత టీ20 జట్టు నుంచి కేఎల్ రాహుల్‌ను చాలా కాలం క్రితం తొలగించారు. ఇప్పటి వరకు భారత టీ20 జట్టులోకి ఎంపిక కాలేదు. రాహుల్ టెస్టు, వన్డే క్రికెట్‌పై కూడా దృష్టి సారించాడు. రాహుల్ ఇప్పటివరకు ఆడిన 72 మ్యాచ్‌లలో 37.75 సగటుతో 2265 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 22 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..