AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile Data: మొబైల్‌లో డేటా వాడేవారికి బిగ్ షాక్.. ప్రతీ జీబీపై రూ.1 పన్ను..!

మొబైల్ డేటా వినియోగదారులకు షాక్. మొబైల్‌లో డేటా వాడేటప్పుడు ప్రతీ జీబీపై పన్ను కట్టాల్సి రావొచ్చు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రతీ జీబీ డేటాపై రూ.1 ట్యాక్స్ విధించాలని సమాలోచనలు చేస్తోంది. దీనిపై టెలి కమ్యూనికేషన్ విభాగం అధ్యయనం ప్రారంభించింది.

Mobile Data: మొబైల్‌లో డేటా వాడేవారికి బిగ్ షాక్.. ప్రతీ జీబీపై రూ.1 పన్ను..!
Mobile Data Privacy
Venkatrao Lella
|

Updated on: Mar 15, 2026 | 1:49 PM

Share

మొబైల్ డేటా వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చేందుకు సిద్దమవుతోంది. మొబైల్ డేటాపై పన్ను విధించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ప్రతీ జీబీపై రూ.1 ట్యాక్స్ వసూలు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ప్రతిపాదన దశలో ఇది ఉండగా.. కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకోవచ్చు. మొబైల్ డేటాకు పన్ను విధించడంపై అధ్యయనం చేయాలని టెలికమ్యూనికేషన్ శాఖకు కేంద్రం ప్రతిపాదనలు పంపింది. దీంతో టెలికమ్యూనికేషన్ శాఖ పరిశీనలలో ఈ నిర్ణయం ఉండగా.. కేంద్ర త్వరలో తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇదే జరిగితే మొబైల్ డేటా మరింత ఖరీదు కానుంది.

ప్రతీ జీబీపై పన్ను

మొబైల్ వినియోగదారులు వాడే ప్రతీ జీబీ డేటాపై రూ.1 పన్ను విధిస్తారు. దీని వల్ల ప్రభుత్వానికి రూ. 22,900 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా వేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొబైల్ డేటా ధరలు భారత్‌లో తక్కువగా ఉన్నాయి. టెలికాం సేవలకు ఇప్పటికే 18 శాతం జీఎస్టీ స్లాబ్‌లో ఉన్నాయి. మొబైల్ డేటా వినియోగంపై కూడా ట్యాక్స్ విధించడం వల్ల ఇంటర్నెట్ వినియోగదారులపై భారం పడనుంది. ఈ పన్నులు విధించవచ్చో.. లేదో అధ్యయనం చేయాలని కేంద్రం కోరింది. కేంద్రం ఇటీవల టెలికాం రంగంపై సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రతిపాదనపై చర్చించి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని టెలికమ్యూనికేషన్ విభాగాన్ని కోరింది. భారతదేశంలో ఇది వర్క్ అవుతుందా.. లేదా అనేది అధ్యయనం చేయాలని సూచించింది.

అమల్లోకి వస్తే ఏమవుతుంది..?

ఇది అమల్లోకి వస్తే మొబైల్‌లో ఇంటర్నెట్ వాడే సమయంలో ప్రతీ జీబీకి రూ.1 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మొబైల్ డేటా ద్వారా వీడియోలు చూసినా, సోషల్ మీడియా బ్రౌజ్ చేసినా, ఆన్ లైన్ సేవలు ఉపయోగించినా మనం వాడే డేటా ఖర్చుకు అదనంగా చిన్న అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది ప్రారంభ దశలోనే ఉందని, తుది నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. అటు దీని వల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూనుంది. దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువమంది ఉన్నారు. అలాగే మొబైల్ డేటా అనేది ప్రతీఒక్కరూ వినియోగిస్తున్నారు. ఆన్ లైన్ గేమ్స్, షార్ట్ ఫామ్ కంటెంట్, వీడియో స్ట్రీమింగ్ వంటి వాటి కోసం వాడుతున్నారు.

Follow Us